ఎల్లారెడ్డి : మైనర్లు వాహనాలు నడిపితే వారితో పాటు తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని ఎల్లారెడ్డి సీఐ రాజారెడ్డి అన్నారు. గురువారం ఎల్లారెడ్డిలో వాహనాలు నడుపుతున్న మైనర్లకు ఆయన కౌన్సిలింగ్ చేశారు. సీఐ మాట్లాడుతూ మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వవొద్దని సూచించారు. స్పెషల్ డ్రైవ్ లో పట్టుబడిన మైనర్లకు మొదటి విడత తప్పుగా భావించి వదిలి పెడుతున్నామన్నారు. మైనర్లు వాహనాలు నడుపొద్దని సూచించారు. కార్యక్రమంలో ఎస్సై 2 సుబ్రహ్మణ్యచారి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


