సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని రైతువేదిక భవనం వద్ద గురువారం 78 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు నల్ల మహిపాల్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సర్పంచ్‌లు వంకాయల శిరీష, సుబ్బారావు, గణేశ్‌నాయక్, శ్రీనివాస్ గౌడ్, తహసీల్దార్ సత్యనారాయణ, ఉప సర్పంచ్ ప్రవీణ్‌కుమార్, పట్టణాధ్యక్షుడు జగ్గ బాల్‌రాజు, వార్డు సభ్యులు ఆస మంజుల, రాజయ్య, భైరయ్య, నాయకులు ఆస రాజు, దేవరెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


