కారు ఢీకొని ప్రైవేటు స్కూల్‌ డ్రైవర్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

కారు ఢీకొని ప్రైవేటు స్కూల్‌ డ్రైవర్‌ మృతి

Nov 22 2026 2:41 AM | Updated on Nov 22 2026 2:41 AM

శంఖవరం: జాతీయ రహదారిపై కారు ఢీకొన్న ఘటనలో స్కూటీపై వెళుతున్న ప్రైవేటు స్కూల్‌ డ్రైవర్‌ మృతి చెందగా, క్లీనర్‌ గాయపడ్డాడు. అన్నవరం పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కత్తిపూడికి చెందిన ఐతు సత్యనారాయణ (59), గొల్లపల్లి అప్పారావు ఆ గ్రామంలోని ఓ ప్రైవేటు విద్యా సంస్థలో డ్రైవర్‌, క్లీనర్లుగా పనిచేస్తున్నారు. రోజూ మాదిరిగానే విధుల్లో భాగంగా శనివారం స్కూటీపై కొమ్మనాపల్లిలోని బస్సు దగ్గరకు బయలుదేరారు. కత్తిపూడిలో 16వ నంబర్‌ జాతీయ రహదారిపై రావికంపాడు వెళ్లే రోడ్డు జంక్షన్‌లో వీరిని తుని నుంచి రాజమహేంద్రవరం వైపు వెళుతున్న కారు ఢీకొంది. ప్రమాదంలో గాయపడిన ఇద్దరినీ కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సత్యనారాయణ మృతి చెందగా, అప్పారావుకు వైద్యం అందిస్తున్నారు. పంచనామా అనంతరం సత్యనారాయణ మృతదేహన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉండగా వారికి వివాహలు అయ్యాయి. అన్నవరం ఎస్సై శ్రీహరిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ

పెద్దాపురం: ఆలయానికి కాలినడకన వెళుతున్న మహిళ మెడలోని బంగారు గొలుసును దొంగ లాక్కుని పరారయ్యాడు. పెద్దాపురం మండలం తిరుపతి – చదలాడ గ్రామాల మధ్య శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. పులిమేరు గ్రామానికి చెందిన ఎలిశెట్టి విజయ గంగాభవాని తన బంధువులతో కలిసి తెల్లవారుజామున తిరుపతి శృంగార వల్లభస్వామి ఆలయానికి నడుచుకుంటూ బయలుదేరింది. చదలాడ సమీపంలోని ఇటుకుల బట్టీ వద్దకు వచ్చేసరికీ ఓ వ్యక్తి వెనక నుంచి గోవిందా అని స్మరిస్తూ వచ్చాడు. గుడికి ఎంత దూరం ఉందని అడిగాడు. గంగాభవాని వెనక్కి తిరిగి సమాధానం చెప్పేలోపు ఆమె మెడలోని సుమారు నాలుగు కాసుల బంగారు గొలుసును లాక్కొని పొలాల్లోకి పారిపోయాడు, బాధితురాలి పిర్యాదు మేరకు పెద్దాపురం ఎస్సై యు.పాపారావు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement