అర్నబ్‌.. హడల్‌ | - | Sakshi
Sakshi News home page

అర్నబ్‌.. హడల్‌

Oct 28 2026 12:12 AM | Updated on Oct 28 2026 12:12 AM

సాక్షి ప్రతినిధి, కాకినాడ: తీరం వైపు వేగంగా దూసుకొస్తున్న అతి తీవ్ర తుపాను ‘అర్నబ్‌’ జిల్లా వాసులను హడలెత్తిస్తోంది. తీరానికి చేరువ కావడంతో మంగళవారమే జిల్లాలో తుపాను ప్రభావం మొదలైంది. మధ్యాహ్నం నుంచి జిల్లా వ్యాప్తంగా బలమైన గాలులు వీస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పలుచోట్ల చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి.

ఉప్పాడ వద్ద కడలి కల్లోలం

తుపాను ప్రభావంతో జిల్లాలో సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ బీచ్‌ రోడ్డు పైకి కడలి అలలు భారీగా ఎగసి పడుతున్నాయి. తీరం కోతకు గురైంది. అలల ఉధృతికి తీర గ్రామాల్లో పలు ఇళ్లు నేల కూలుతున్నాయి. ఇటీవల రాళ్లతో బాగా ఎత్తుగా నిర్మించిన గట్టును దాటుకుని మరీ అలలు విరుచుకుపడుతున్నాయి. బీచ్‌ రోడ్డు పైకి రాళ్లు చేరాయి. తీరంలో 2.50 మీటర్ల ఎత్తు వరకూ అలలు ఎగసి పడుతున్నాయి. కొత్తపల్లి మండలం అమీనాబాద్‌, కోనపాపపేట వద్ద కెరటాలు ఉధృతంగా ఉండటంతో ఉప్పాడ బీచ్‌ రోడ్డులో రాకపోకలను అధికారులు నిలిపివేశారు. బారికేడ్లు పెట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కాకినాడ రూరల్‌ సూర్యారావుపేట బీచ్‌కు సందర్శకులు వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. రెండు ఎన్‌డీఆర్‌ఎఫ్‌, రెండు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దింపారు. ఎస్పీ జి.బిందుమాధవ్‌ ఉప్పాడ తీర ప్రాంతాన్ని పరిశీలించి, సంబంధిత అధికారులకు కీలక సూచనలు జారీ చేశారు.

దూసుకొస్తున్న సముద్రం

సముద్రం అల్లకల్లోలంగా మారి, తీరం వైపు ముందుకు దూసుకు వస్తోంది. ఉప్పాడ వద్ద ఇప్పటికే సుమారు 100 మీటర్ల మేర ముందుకు వచ్చింది. తాళ్లరేవు మండలం పోలేకుర్రు వద్ద 300 మీటర్లు, జి.వేమవరం వద్ద 180 మీటర్లు, పొన్నాడ వద్ద 200 మీటర్లు మేర సముద్రం ముందుకు వచ్చే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది.

లోతట్టు ప్రాంతాలు జలమయం

జిల్లాలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇంద్రపాలెం, ఆటోనగర్‌, హార్బర్‌ పేట, సూర్యారావుపేట తదితర ప్రాంతాల్లో వాననీరు చేరింది. తాళ్లరేవు మండలం గాడిమొగ, పోలేకుర్రు, గ్రాంటు తదితర లోతట్టు, సముద్ర తీర గ్రామాల్లోని ప్రజలను ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పునరావాస కేంద్రాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. వారికి అక్కడ భోజనం, తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు.

పోలీసు సహాయానికి..

కొత్తపల్లి: తుపాను సమయంలో అత్యవసర పరిస్ధితులు ఎదురైతే తక్షణ పోలీసు సహాయానికి జిల్లా పోలీసు యంత్రాంగం కూడా కంట్రోల్‌ రూము ఏర్పాటు చేసింది. అవసరమైన వారు 94949 33233, 94906 19298 నంబర్లకు ఫోన్‌ చేయాలని ఎస్పీ బిందుమాధవ్‌ సూచించారు.

కడలి కన్నెర్ర చేయడంతో ఇల్లు ఖాళీ చేసి, ఉప్పాడ నుంచి సురక్షిత ప్రాంతానికి వెళ్తున్న ఓ కుటుంబం

సామర్లకోట: గణపతినగరం వాటర్‌ ట్యాంకుల వద్ద కూలిన విద్యుత్‌ స్తంభం

·˘ ÐólVýS… ò³…_, Mø¯]lïÜÐ]l$ OÐðlç³# §ýl*çÜ$MöçÜ$¢¯]l² A† ¡{Ð]l ™èl$´ë¯]l$

·˘ AÐ]l$Ìêç³#Æý‡… & A…™èlÆó‡Ó¨ Ð]l$«§ýlÅ ¡Æý‡… Ò$¨MìS..

·˘ M>MìS¯éyýl hÌêÏÐéÅç³¢…V>

ఎడతెరిపి లేని భారీ వర్షాలు

·˘ E´ëµyýl ½^Œl Ð]l§ýlª Æý‡„ýS׿ Æ>â¶æ$Ï «§ýlÓ…çÜ…

·˘ M>MìS¯éyýl ´ùÆý‡$tÌZ 10Ð]l ¯]l…ºÆŠ‡ {ç³Ð]l*§ýl òßæ^èlaÇMýS

·˘ ¯ólyýl$ Ð]l$Ç…™èl {糿êÐ]l… ^èl*õ³ ^鯌SÞ

రాత్రే తీరాన్ని తాకిన తుపాను

సాక్షి, అమలాపురం: అర్నబ్‌ తుపాను యానాం సమీపాన తీరం దాటవచ్చని వాతావరణ శాఖ తొలుత అంచనా వేసింది. అనంతరం, కోనసీమలోని కాట్రేనికోన మండలం చిర్ర యానాం సమీపాన లేదా అల్లవరం – మామిడికుదురు మండలాల సరిహద్దులో వైనతేయ గోదావరి నది సాగర సంగమ ప్రాంతం వద్ద తీరం దాటవచ్చని భావించారు. దీంతో, తుపాను గమనం ఎప్పుడు ఎలా ఉంటుందోననే ఉత్కంఠ నెలకొంది. చివరకు రాత్రి 8.30 గంటల సమయానికి ఈ తుపాను కోనసీమ తీరానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. అంతకుముందు గడచిన 6 గంటల్లో ఈ తుపాను గమన వేగం గంటకు 18 కిలోమీటర్లకు పెరిగింది. దీంతో, తుపాను బాహ్య వలయం కోనసీమ రాత్రి 8.30 గంటల సమయానికే తీరాన్ని తాకినట్లు గుర్తించారు. ఇది అర్ధరాత్రి 12 నుంచి 1.30 గంటల మధ్య మలికిపురం మండలం శంకరగుప్తం – సఖినేటిపల్లి మండలం అంతర్వేది నడుమ తీరం దాటవచ్చని అంచనా వేశారు. ఇదిలా ఉండగా, సింగపూర్‌ శాటిలైట్‌ సమాచారం ప్రకారం ఈ తుపాను ఓడలరేవు – శంకరగుప్తం మధ్య తీరం దాటుతున్నట్లు ఎమ్మెల్యే ఆనందరావుకు ఓఎన్‌జీసీ అధికారులు సమాచారం ఇచ్చారు. అప్పటికి భూమి మీద గాలి వేగం 90 కిలోమీటర్లు ఉండగా తుపాను తీరం దాటే ప్రాంతంలో 200 కిలోమీటర్లకు పెరిగిందని చెబుతున్నారు. మొత్తం మీద తుపాను ప్రభావంతో జిల్లా వాసులకు మంగళవారం రాత్రంతా కంటి మీద కునుకు కరువైంది.

స్తంభించిన పోర్టు

కాకినాడ రూరల్‌: సముద్రం అల్లకల్లోలంగా మారడంతో కాకినాడ పోర్టులో కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఎగుమతులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. సరకు రవాణా చేసే నౌకలు రేవుకే పరిమితమయ్యాయి. పోర్టులో పదో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పదో నంబరు అంటే అత్యంత ప్రమాదకరమైన హెచ్చరికగా భావిస్తారు. ఇటీవలి కాలంలో కాకినాడ పోర్టులో 10వ నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేయడం ఇదే ప్రథమం. తుపాను ప్రభావాన్ని బట్టి మిగిలి ఉన్న మరో హెచ్చరిక 11వ నంబరు కూడా ఎగురవేసే అవకాశం ఉందని పోర్టు అధికారులు తెలిపారు. సూర్యారావుపేట బీచ్‌ వద్ద సముద్రం ఉగ్రరూపం దాల్చింది. సందర్శకులు కూర్చునే బెంచీలను దాటుకుని మరీ నీరు ముందుకు చొచ్చుకు వచ్చింది. మత్స్యకారులు సముద్రంలో చేపల వేట మానుకుని ఇళ్లకే పరిమితమయ్యారు. అలల ఉధృతికి తీరంలో లంగరు వేసిన బోట్లు దెబ్బ తినే ప్రమాదముందని ఆందోళన చెందుతున్నారు. కుంభాభిషేకం రేవు వద్ద బోట్లను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement