కూటమి కూరలో.. కరివేపాకులా.. | - | Sakshi
Sakshi News home page

కూటమి కూరలో.. కరివేపాకులా..

Oct 28 2026 12:12 AM | Updated on Oct 28 2026 12:12 AM

సాక్షి, అమలాపురం/కొత్తపేట: సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గద్దెనెక్కాలనే ఆశతో.. ప్రధాని మోదీ ఇమేజ్‌ను వాడుకోవాలని చంద్రబాబు అనుకున్నారు. కాళ్లావేళ్లా పడి కమలాన్ని బుట్టలో వేసుకున్నారు. పొత్తు అన్నారు. సింహాసనం అధిరోహించాక అవసరం తీరిపోయింది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల వేళ.. అన్నీ తమకే కావాలనే ఆశతో పొత్తును చెత్తబుట్టలోకి విసిరేస్తున్నారు. కమలాన్ని కూరలో కరివేపాకులా తీసి పారేస్తున్నారు. టీడీపీ తీరుపై కమలనాథులు కస్సుమంటున్నారు.

ఆశలు రేపి.. ఆవిరి చేసి

జిల్లాలో 19 జెడ్పీటీసీ స్థానాలుండగా.. కొత్తపేట నుంచి ఆ పార్టీ సీనియర్‌ నేత, నియోజకవర్గ ఇన్‌చార్జి పాలూరి సత్యానందం, మామిడికుదురు నుంచి మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమ కుమార్తె మానేపల్లి కృష్ణ శ్రీవల్లి నామినేషన్లు వేశారు. మరో రెండు స్థానాల్లో కూడా ఆ పార్టీ నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు. కనీసం మామిడికుదురు, కొత్తపేట తమకు దక్కుతాయని భావించగా వారికి ఆశాభంగమే ఎదరైంది. మామిడికుదురు నుంచి బీజేపీ తరఫున శ్రీవల్లి, టీడీపీ నుంచి గొల్లపల్లి అమూల్య, జనసేన తరఫున పెనుమాల లక్ష్మి, అదే పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కుమార్తె కొండేటి దేవీ ప్రియాంక నామినేషన్లు వేశారు. చివరకు బీజేపీకి ఈ సీటు దక్కకపోవడంతో వేమా కుటుంబానికి గుర్తింపు ఇవ్వలేదనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొత్తపేటలోనూ పాలూరి సత్యానందంతో నామినేషన్‌ వేయించి, చివరకు మొండిచెయ్యి చూపడం ఆయన వర్గీయులను కలచివేసింది. ఈ పరిణామాన్ని కొందరు నేతలు బాబు మార్కు వెన్నుపోటుగా అభివర్ణిస్తున్నారు.

జనసేనకు సర్దుబాటు.. బీజేపీకి సర్దు‘పోటు’

జనసేనకు అభ్యర్థులు లేనిచోట్ల ఆ పార్టీ తరఫున టీడీపీ నాయకులనే బరిలోకి దించిన దాఖలాలున్నా యని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ముమ్మిడివ రం నగర పంచాయతీ చైర్‌పర్సన్‌ పదవిని జనసేనకు ఇచ్చి, టీడీపీ నుంచే అభ్యర్థిని నిలబెట్టారు కానీ బీజేపీకి మాత్రం అవకాశం ఇవ్వలేదని వాపోతున్నారు.

మున్సిపాలిటీల్లోనూ అరకొరే

మరోవైపు మున్సిపాలిటీల్లో సైతం కమలనాథులకు అరకొరగానే కేటాయించారు. అమలాపురం మున్సిపాలిటీలో 36 వార్డులకు గాను బీజేపీకి 2, రామచంద్రపురంలో 32 వార్డులకు 2, ముమ్మిడివరం నగర పంచాయతీలో 23 వార్డులకు ఒక్కటి మాత్రమే ఇచ్చారు. మొత్తం 91 వార్డులకు గాను బీజేపీని ఐదు వార్డులకే పరిమితం చేశారు. అలాగే, 19 మండల పరిషత్‌ అధ్యక్ష (ఎంపీపీ) పదవుల విషయంలోనూ తమకు ప్రాధాన్యం దక్కలేదని, ఎంపీటీసీ స్థానాల్లోనూ ఆశించిన ప్రాతినిధ్యం ఇవ్వలేదని ఆ పార్టీ నేతలు ఆవేదన చెందుతున్నారు.

ఫ బీజేపీకి బాబు మార్కు వెన్నుపోటు

ఫ పొత్తులో కమలానికి మొండిచెయ్యి

ఫ ఒక్క జెడ్పీటీసీ స్థానం కూడా

ఇచ్చేందుకు ‘నో’

ఫ ఎంపీపీ పదవుల ఊసే లేదు

ఫ ఎంపీటీసీల్లోనూ అరకొరే

ఫ కొత్తపేట, మామిడికుదురులో సీనియర్లకు నిరాశ

ఫ మున్సిపాలిటీల్లోనూ

ఐదు వార్డులకే పరిమితం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement