తుపానే ఫస్ట్‌.. ఎన్నికల విధులు నెక్ట్స్‌ | - | Sakshi
Sakshi News home page

తుపానే ఫస్ట్‌.. ఎన్నికల విధులు నెక్ట్స్‌

Oct 28 2026 12:12 AM | Updated on Oct 28 2026 12:12 AM

జిల్లాలోని అన్ని శాఖల అధికారులూ తుపాను సహాయక చర్యల పైనే దృష్టి సారించాలి. ఎన్నికల విధుల కంటే కూడా ప్రాణనష్టాన్ని నివారించడం, తుపాను సహాయక చర్యలకే అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలందరూ వెంటనే సురక్షిత ప్రాంతాలకు లేదా పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలి. ఒక్కో పునరావాస కేంద్రంలో 10 వేల నుంచి 15 వేల మందికి వసతి కల్పించేలా ఏర్పాట్లు చేశాం. ఈ కేంద్రాల్లో ప్రథమ చికిత్స అందించేందుకు ఆరోగ్య శాఖ సిబ్బందిని కేటాయించాలి. పెదపూడి మొదటి రింగు రోడ్డు వద్ద సుమారు 10 మీటర్ల వెడల్పున రాళ్లు జారిపోతున్నందున గండి పడే ప్రమాదముందని, తక్షణం అక్కడ గట్టును పటిష్టం చేయాలి. యు.కొత్తపల్లికి తక్షణం 3 నుంచి 4 లోడ్‌లలో పెద్ద సైజు రాళ్లు తరలించాలి. రిజర్వాయర్లలో నీటిమట్టం పెరుగుదలపై ఇరిగేషన్‌ అధికారులు అప్రమత్తంగా ఉండాలి. జిల్లావ్యాప్తంగా సాయంత్రం 6 గంటలకల్లా మార్కెట్లు, షాపులు, సినిమా థియేటర్లను పూర్తిగా మూసివేయాలి. ప్రజలు బయట తిరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఎవ్వరినీ సముద్ర తీరం వైపు వెళ్లనివ్వరాదు. మండల ప్రత్యేక అధికారులందరూ రాత్రి వేళ కూడా తమకు కేటాయించిన మండల కేంద్రాల్లోనే ఉంటూ పరిస్థితులను పర్యవేక్షించాలి. సామాజిక మాధ్యమాల్లో వచ్చే అనధికారిక సమాచారాన్ని, వదంతులను ప్రజలు నమ్మవద్దు. కేవలం అధికారుల నుంచి వచ్చే సూచనలు మాత్రమే పాటించాలి.

– అసిస్టెంట్‌ కలెక్టర్‌ ప్రియ, డీఆర్‌ఓ

తిప్పేనాయక్‌తో కలసి జిల్లా, మండల

అధికారులతో నిర్వహించిన వీడియో

కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంధిర ప్రసాద్‌

– బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement