సామర్లకోట: కాకినాడ జిల్లా బాలుర, బాలికల కబడ్డీ జట్ల ఎంపిక ఆదివారం జరిగిందని జిల్లా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొండపల్లి శ్రీనివాసరావు తెలిపారు. కాకినాడ పీఆర్ ప్రభుత్వ కళాశాల ఆవరణలో నిర్వహించిన పోటీల్లో ఎంపికై న జట్లు వచ్చేనెల 16 నుంచి 18 వరకు మార్కాపురంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొంటాయని తెలిపారు. రాష్ట్ర కోచ్ పోతుల సాయిప్రసాద్, ప్రోకడీ రిఫరీ బోగిళ్ల మురళీకుమార్, పీడీలు పాల్గొన్నారు.
జిల్లా బాలికల జట్టు..: కె.అరుణశ్రీ, కె.చెక్రిక హర్షిణి, ఎం.మానస, ఐ.గీతామాధవి, ఎంపీఎస్ దర్శిత, ఎ.గ్రీష్మ, జి.శిరిష, ఈ.వర్విష, డి.శ్రీవల్లి, కె.లఖిల, ఎం.శృతి, ఎం.విరోనిక, జె.లోవకుమారి, పీఆర్ తులసి, సీహెచ్ ప్రత్యూష, ఎం పద్మవల్లి, కెఎం అవంతిక, కె.బుజ్జమ్మ.
జిల్లా బాలుర జట్టు : పి.హరిష, ఎన్.వంశీ, కె.జాన్, జి.చందు, ఆర్.శ్రీరామ్, జి. త్రిమూర్తులు, కె.సత్యసాయి, బి.ఏలిష, బి.ప్రవీణ్, పీఎల్ నారాయణ, బి.అజయ్, జి..రాజేష్, ఎన్‌వీ వెంకన్న, కె.అభిరామ్, కె.చిన్న ఈశ్వర్, ఎస్.సత్యం, పి.పరుశురామ్, పి.గౌతమ్, ఎన్.అనిల్‌కుమార్.
జిల్లా బాలుర కబడ్డీ జట్టు
జిల్లా బాలికల కబడ్డీ జట్టు


