● కుక్క కాటును నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం
● సత్ఫలితాలివ్వని ఏబీసీ శస్త్ర చికిత్సలు
● నేడు ప్రపంచ ర్యాబిస్ నివారణ దినం
అందుబాటులో ఏఆర్‌వీ
జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో యాంటీ రేబిస్ వ్యాక్సిన్లు (ఏఆర్‌వీ) అందుబాటులో ఉన్నాయి. కుక్క కరిచిన వెంటనే అధైర్య పడకుండా సమీప ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలి.
– ఎం.సుమలత, జిల్లా కన్వీనర్,
ఆర్‌బీఎస్‌కే, అమలాపురం
ఆలమూరు: కేవలం కుక్కల వల్లే కాకుండా పిల్లి, నక్క, డేగ వంటి జంతువుల వల్ల కూడా రేబిస్ వ్యాధి వచ్చే ప్రమాదం ఉన్నప్పటికీ ఇంటా బయటా ఎక్కువగా ప్రజలు కుక్క కాట్లకే త్వరగా గాయపడి ఈ వ్యాధి బారిన పడుతుంటారు. వీధి కుక్కల సంతతి అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం మనపైనే ఉంది. యాంటీ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) శస్త్ర చికిత్సల వల్ల అంతగా ప్రయోజనం కనిపించడం లేదన్నది నిర్వివాదాంశం. 2024లో పశుసంవర్థక శాఖ గణాంకాల ప్రకారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 95,571 కుక్కలు ఉన్నాయి. కాగా 2025–26 మధ్య కాలంలో సుమారు 16 వేల మంది కుక్క కాట్లకు గురయ్యారు. 2030 చివరి నాటికి ర్యాబిస్ రహిత దేశంగా అవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం కనుచూపు మేరలో కనపడడం లేదు. రేబిస్ నిరోధక టీకాను కనుగొన్న లూయీ పాశ్చర్ వర్ధంతిని పురస్కరించుకుని ఏటా సెప్టెంబర్ 28న ర్యాబిస్ నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో కుక్కకాటు వల్ల ఎదురయ్యే దుష్పరిణామాల గురించి చర్చించుకోవడం అవసరం.
రేబిస్ వ్యాధి లక్షణాలు
● రేబిస్ సోకిన రోగికి గొంతు మింగుడు పడదు.
● ఆహారం తినలేక ఆరోగ్యం క్షీణిస్తుంది.
● నీళ్లను చూస్తే భయపడుతుంటారు.
● వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ మందబుద్ధులవుతారు.


