వాహనాలు ఢీకొని ముగ్గురికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

వాహనాలు ఢీకొని ముగ్గురికి గాయాలు

Sep 28 2026 12:59 AM | Updated on Sep 28 2026 12:59 AM

రాయవరం: మండలంలోని సోమేశ్వరం శివారు నాగవంశీయులపేట వద్ద ఆదివారం మధ్యాహ్నం రెండు వాహనాలు ఢీకొని ముగ్గురు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రామచంద్రపురం నుంచి మోటార్‌ సైకిల్‌పై ఇద్దరు వస్తుండగా, రాయవరం వైపు నుంచి మోటార్‌ సైకిల్‌ను నడిపించుకుంటూ మరో వ్యక్తి వస్తున్నాడు. ఆగి ఉన్న లారీని దాటే క్రమంలో ఆ ఇద్దరు వ్యక్తులు వాహనాన్ని నడిపిస్తూ వస్తున్న వ్యక్తిని ఢీకొట్టారు. దీంతో ముగ్గురికీ గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఎస్సై డి.సురేష్‌బాబును వివరణ కోరగా తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.

చికిత్స పొందుతూ

యువకుడి మృతి

అనపర్తి: మోటార్‌ బైక్‌ జారిపడి గాయాలపాలైన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. బిక్కవోలు పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బిక్కవోలు గ్రామం కొత్తపేటకు చెందిన కల్లేపల్లి శివరామకృష్ణ (26) తాపీ పనితో పాటు శుభకార్యాలకు వంటలు కూడా చేస్తుంటాడు. ఈ నెల 21న గోకవరంలో శుభకార్యానికి వంట పనికి వెళ్లి 23వ తేదీ రాత్రి తిరిగి వస్తుండగా బలభద్రపురం కానేడు రోడ్‌ వద్ద పెట్రోలు బంకు సమీపంలో వర్షం వల్ల రోడ్డు కనపడక వాహనం అదుపుతప్పి పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతడి తలకు తీవ్ర గాయం కావడంతో అటుగా వెళ్తున్న వారు 108 అంబులెన్సుకు సమాచారం ఇచ్చి అనపర్తి ఏరియా ఆస్పత్రికి ప్రధమ చికిత్స నిమిత్తం తరలించారు. అనంతరం మెరుగైన చికిత్సకు కాకినాడ జీజీహెచ్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 10.45 గంటలకు మృతి చెందాడు. శివరామకృష్ణ తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్సై రవిచంద్రకుమార్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement