స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధమవుతోంది.. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై వ్యతిరేకతను సానుకూలంగా మార్చుకునేందుకు చంద్రబాబు కొత్త ఎత్తుగడతో ముందుకు రావడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలును పట్టించుకోని ప్రభుత్వం.. ఇప్పుడేమో ఏదో చేసేసినట్లు సొంత డబ్బా కొట్టుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంది. దీనికోసం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను ప్రచారానికి వినియోగించుకోవాలని రాష్ట్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది.
తద్వారా ఒక్కొక్కరికీ రూ.లక్షలు ఇచ్చేందుకు కుట్ర పన్నుతోంది.
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): చంద్రబాబు ప్రభుత్వం గత ఎన్నికల వేళ ఇచ్చిన హామీల అమలు లేదు. పథకాల నిర్వహణకు అతీగతి లేదు.. దీనిపై జనంలో వ్యతిరేకత వస్తుండగా, మరోవైపు తాము ఇంత చేశాం.. అంత చేశామంటూ సొంత డబ్బా కొట్టుకునేందుకు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను వినియోగిస్తూ వారికి ప్రభుత్వ నిధుల నుంచి చెల్లింపులు చేయాలన్న నిర్ణయం రాజకీయ, ప్రజావర్గాల్లో చర్చకు దారితీస్తోంది. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ప్రచారం కోసం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను ఎంప్యానెల్‌మెంట్ విధానానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం సిగ్గుచేటని పలువురు మండిపడుతున్నారు. ఫాలోవర్ల సంఖ్య ఆధారంగా ఇన్‌ఫ్లుయెన్సర్ల ఒక్కో వీడియోకు చెల్లింపులు చేయడంతో పాటు, ఒక్కో కంటెంట్ క్రియేటర్‌కు నెలకు గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు చెల్లించేందుకు సిద్ధమవ్వడం దారుణమంటున్నారు. 2024 ఎన్నికలకు ముందు కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోలో మహిళలు, యువతకు సంబంధించి అనేక హామీలు ఉన్నాయి. 19 నుంచి 59 ఏళ్ల వయసున్న అర్హులైన మహిళలకు నెలకు రూ.15 వేలు, యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడం లేకుంటే ఉద్యోగం లభించే వరకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి వంటి హామీలు అందులో ఉన్నాయి. వీటి అమలుకు ఎక్కడా చర్యలు లేవు.
డబ్బులు లేవంటూ డబ్బా కొట్టుకునేందుకు..
సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసేందుకు డబ్బులు లేవంటున్న ప్రభుత్వం ఈ ఇన్‌ఫ్లుయెన్సర్లకు ఇచ్చేందుకు నిధులు ఎక్కడ నుంచి వచ్చాయని ప్రజా సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఎన్నికలు దగ్గర పడేకొద్దీ చంద్రబాబుకు ప్రచార యావ ఎక్కువైపోతుందని, ఇందులో భాగంగా ఐటీడీపీ నాయకులకు ప్రజల డబ్బులు దోచిపెట్టేందుకు బరితెగించారని అంటున్నారు. రైతులకు ఉచిత పంట బీమా పథకానికి ఎగనామం పెట్టి, సున్నా వడ్డీ వంటి పథకాలు కనుమరుగు చేసిన చంద్రబాబు ప్రస్తుతం వారి పార్టీ నాయకులకు ఉపయోగపడే పథకాలు అమలు చేసుకొంటున్నారని రైతులు సైతం మండిపడుతున్నారు.
50 ఏళ్లకే పింఛన్ ఏమైంది?
బీసీల్లో అర్హత ఉన్నవారికి 50 ఏళ్ల వయసు నుంచే రూ.4 వేల సామాజిక భద్రతా పింఛన్ ప్రారంభిస్తామని కూటమి మేనిఫెస్టోలో పేర్కొంది. అలాగే ఇతర సామాజిక భద్రతా పింఛన్లను పెంచుతామని హామీ ఇచ్చింది. జిల్లాలో 50 ఏళ్లకు పింఛన్ పొందే అర్హత దాదాపు 2 లక్షల మంది ఉన్నారు. వారంతా ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఆడబిడ్డ నిధి ఏదీ బాబూ..
18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చెల్లిస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. రెండున్నరేళ్లు గడుస్తున్నా ఆడబిడ్డ నిధి ఊసేలేదు. జిల్లాలో ఆడబిడ్డ నిధి అర్హులు సుమారు 6 లక్షలకు పైగా ఉన్నారు. చంద్రబాబు హామీలు నమ్మి ఓట్లు వేస్తే ప్రస్తుతం తమను అన్నివిధాలా మోసం చేశారని మహిళలు మండిపడుతున్నారు. తమకు నెలకు రూ.1,500 ఇచ్చేందుకు డబ్బులు లేవంటున్న ఈ ప్రభుత్వానికి ఐటీడీపీ నాయకులకు దోచిపెట్టేందుకు డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయని ప్రశ్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించేందుకు ఇప్పటి నుంచి ప్రచారం చేసుకొనేందుకు కొత్త పన్నాగం పన్నారని ప్రజా సంఘాల నాయకులు అంటున్నారు. దీనిలో భాగంగానే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు నెలనెలా డబ్బులు చెల్లించే పథకమని మండిపడుతున్నారు.
అన్నవరం: ఎంకి పెళ్లి సుబ్బు చావుకొచ్చిందన్న సామెత ఇదేనేమో.. అన్నవరంలోని పంపా రిజర్వాయర్‌లోకి భారీగా వర్షపునీరు వస్తున్నా, నిల్వ చేసుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇందుకు ప్రధాన కారణం పంపా గర్భంలో జరుగుతున్న పోలవరం అక్విడెక్ట్ పనులే. భారీ వర్షాలతో నీరు వస్తుండడంతో పంపా నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. కానీ ఏమి లాభం. వచ్చిన నీరు వచ్చినట్టుగానే విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
స్థానిక పంపా రిజర్వాయర్‌లోకి భారీగా వర్షపునీరు వస్తుండడంతో నీటి ఉధృతి పెరుగుతోంది. ఫలితంగా రిజర్వాయర్ నీటిమట్టం శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు 99 అడుగులకు చేరింది. పంపా గరిష్ట నీటిమట్టం 103 అడుగులు. పంపా క్యాచ్‌మెంట్ ఏరియా శంఖవరం, రౌతులపూడి మండలాల్లోని ఏజెన్సీ గ్రామాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రిజర్వాయర్‌లోకి 1,500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో రిజర్వాయర్ నీటిమట్టం శనివారం ఉదయానికి 100 అడుగులకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 103 అడుగుల వరకు నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉన్నా, పోలవరం అధికారుల అభ్యంతరంతో పంపా పంట కాలువ నుంచి 220 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పంపాకు వరద నీరు మరో మూడు రోజుల వరకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
నిల్వ చేయొద్దు.. వదిలేయండి!
పంపా రిజర్వాయర్ గర్భంలో నుంచి వెళ్తున్న పోలవరం కాలువ అక్విడెక్ట్ పనులకు పెరుగుతున్న పంపా నీటిమట్టం అడ్డంకిగా మారిందని పోలవరం అధికారులు అంటున్నారు. దీంతో పంపాలో ఎక్కువ నీరు నిల్వ చేయవద్దని పోలవరం అధికారులు పంపా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. గతంలో ఈ రిజర్వాయర్ నీటిమట్టం 106 అడుగుల వరకు ఉండేది. 104 అడుగుల వరకూ నీటిని నిల్వ చేసేవారు. అయితే పుష్కర కాలువ పంపా గర్భంలో నిర్మించినప్పుడు నీటిమట్టం 103 అడుగులు దాటితే పంపా నీరు పుష్కర కాలువలోకి వెళ్లిపోయేది. దాంతో పంపా గరిష్ట నీటిమట్టం 103 అడుగులకు తగ్గించారు. నీటిమట్టం వంద అడుగులు దాటితే పరిస్థితిని బట్టి నీటిని సముద్రంలోకి విడుదల చేసేవారు.
గతేడాది నుంచీ ఇదే పరిస్థితి
2025 ఏప్రిల్‌లో పంపాలో నీరు అడుగంటడంతో శ్రీరామనవమి వేడుకలు, సత్యదేవుని కల్యాణ మహోత్సవాలు నిర్వహించడానికి కూడా నీరు లేదు. అప్పుడు ఏలేరు నుంచి నీరు విడుదల చేయాలని దేవస్థానం అధికారులు అప్పటి జిల్లా కలెక్టర్ షణ్మోహన్‌ను కోరారు. ఆ మేరకు ఆయన ఆదేశాలిచ్చారు. అయితే పంపాకు ఏలేరు నీరు విడుదలైతే పోలవరం అక్విడెక్ట్ పనులకు ఆటంకమని అభ్యంతరం చెప్పడంతో కలెక్టర్ ఏప్రిల్ రెండో తేదీన అన్నవరం వచ్చి అక్విడెక్ట్ పనులకు ఆటంకం లేకుండా పైప్‌లైన్ ద్వారా నీటిని విడుదల చేయడానికి నిధులు మంజూరు చేస్తానని చెప్పి పరిస్థితి చక్కదిద్దారు.
ఆటంకం కలుగుతుందని..
కాగా, పంపా నదీ గర్భం నుంచి పోలవరం కాలువ నిర్మాణం, దానిపై అక్విడెక్ట్ పనులు ఇటీవల ఊపందుకున్నాయి. దీంతో పంపా నీటిమట్టం పెరిగితే నీరు పోలవరం అక్విడెక్ట్ స్థలంలోకి వచ్చేస్తుండడంతో ఆ పనులకు ఆటంకం కలుగుతోందని పోలవరం అధికారులు చెబుతున్నారు. ఫలితంగా పంపా నీటిమట్టం 94 అడుగులు దాటితే చాలు, నీటిని దిగువకు వదిలేయమని చెబుతున్నారని పంపా అధికారులు అంటున్నారు. ఒకవేళ నీరు వదలకపోతే జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామంటున్నారని వారు వాపోతున్నారు.
వర్షపు నీటితో పంపా రిజర్వాయర్
పంపా నీటిని దిగువకు విడుదల చేస్తున్న దృశ్యం
ఫ సొంత ప్రచారానికి
చంద్రబాబు కొత్త ఎత్తుగడ
ఫ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల
నియామకానికి ఆమోదం
ఫ ఒక్కొక్కరికి రూ.లక్షల్లో
ముట్టజెప్పేందుకు స్కెచ్
ఫ ప్రజాధనం దుర్వినియోగమే
అంటున్న ప్రజా సంఘాలు
నీట మునిగిన
అక్విడెక్ట్ నిర్మాణ స్థలం
పోలవరం అక్విడెక్ట్ పనులు పూర్తయ్యేవరకు పంపాలో 94 అడుగులకు మించి నీటిమట్టం నిల్వ ఉంచవద్దని అధికారులు చెబుతున్నప్పటికీ, భారీగా వస్తున్న వరద నీరు వల్ల ఆ పరిస్థితి సాధ్యం కావడం లేదు. గత రెండ్రోజులుగా పంపాకు పోలవరం అక్విడెక్ట్ స్థలం మీదుగా వరద నీరు వస్తోంది. దీంతో ఆ స్థలం, కట్టడాలన్నీ నీట మునిగాయి. ఈ నీరు తగ్గేవరకు పోలవరం అక్విడెక్ట్ పనులు కొనసాగించే అవకాశం లేదు. అయితే పంపాలో కనీసం వంద అడుగులు అయినా నీటిమట్టం కొనసాగించాలని, పోలవరం అధికారుల ఒత్తిడికి లొంగి నీటిని వదిలేస్తే సాగునీరు మాట దేవుడెరుగు వచ్చే వేసవిలో తాగునీటికి కూడా ఇబ్బంది వస్తుందని రైతులు అంటున్నారు. శుక్రవారం పంపా నీటిమట్టం 99 అడుగులకు చేరినప్పటికీ 220 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నీటిమట్టం ఇంకా పెరిగితే నీటి విడుదల ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
ఫ భారీగా జలాలొచ్చినా
నిల్వకు సరేమిరా!
ఫ పోలవరం అక్విడెక్ట్ పనులతో అడ్డంకులు
ఫ నీటిమట్టం 94 అడుగులు దాటితే,
వదిలేయాలని ఆదేశం
ఫ 220 క్యూసెక్కుల
నీరు దిగువకు విడుదల
నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తారో..
తాము అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తామని, లేకుంటే నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి ఇస్తామని హమీ ఇచ్చారు. జిల్లాలో దారిద్య్ర రేఖకు దిగువ ఉన్న 5,73,959 కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాలకు చెందిన చదువుకున్న యువకులంతా నిరుద్యోగ భృతికి అర్హులే. జిల్లాలో దాదాపు 2.50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వీరందరికీ నిరుద్యోగ భృతి దక్కాలి. జిల్లాలో ఆదికవి నన్నయ యూనివర్సిటీ పరిధిలో ఏటా డిగ్రీ పట్టాలు తీసుకొంటున్న వారు 12 వేల మంది ఉంటున్నారు. జేఎన్‌టీయూకే పరిధిలో ఇంజినీరింగ్ పట్టాలు పొందిన వారు సుమారు 6 వేలకు పైగా ఉంటున్నారు. వీరు కాకుండా డిప్లొమా, ఐటీఐ, చదివిన వారున్నారు. జిల్లాలో సరాసరి 35 వేల మంది తక్కువ కాకుండా యువత ఏటా పట్టాలు పుచ్చుకొని ఉద్యోగాలు కోసం ఎదురుచూస్తున్నారు. వీరికి మాత్రం నిరుద్యోగ భృతి ఇవ్వని చంద్రబాబు ప్రస్తుతం ప్రచార యావతో టీడీపీ నాయకులకు లబ్ధి చేసేందుఉక ముందుకు రావడంపై యువత మండిపడుతున్నారు.


