పచ్చనేతలకే ఉపయోగం | - | Sakshi
Sakshi News home page

పచ్చనేతలకే ఉపయోగం

Sep 26 2026 12:26 AM | Updated on Sep 26 2026 12:26 AM

సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు నేరుగా జీతం ఇవ్వడం అంటే ప్రజాధనం దుర్వినియోగం చేయడమే. యువకులకు ఉద్యోగాలు కల్పించకుండా, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేస్తోంది. అధికార పార్టీలో రాజకీయ నిరుద్యోగులకు మాత్రం ప్రభుత్వం ధనం అందించాలన్న తాపత్రయంతో చంద్రబాబు ఈ పథకం తెరమీదకు తెచ్చారు. దీనివల్ల పచ్చ నాయకులకు తప్ప సాధారణ వ్యక్తులకు ఎటువంటి ఉపయోగం ఉండదు.

–దూసర్లపూడి రమణరాజు,

పౌర సంక్షేమ సంఘ కన్వీనర్‌, కాకినాడ

సిగ్గనిపించడం లేదా?

సొంత డబ్బాకొట్టుకోవడానికి సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు డబ్బులు ఇస్తామని జీఓలు ఇవ్వడం సిగ్గుగా అనిపించడం లేదా. సూపర్‌ సిక్స్‌ పథకాలకు నిధులు లేవని చెబుతూ, ఇప్పటికీ రూ.లక్షల కోట్లు అప్పుతెచ్చి ప్రజలపై భారం మోపారు. ప్రస్తుతం మళ్లీ టీడీపీ నాయకులకు లబ్ధి చేకూర్చేందుకు కొత్త పథకాలు తెరపైకి తెస్తున్నారు. నిరుద్యోగ భృతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు 50 ఏళ్ల పింఛన్‌ పథకం ఎందుకు అమలు చేయడం లేదు. కొత పఽథకానికి డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయి.

– తాటిపాక మధు,

సీపీఐ రాష్ట్ర కార్గవర్గ సభ్యులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement