బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ఈ నెల 27న రాజమహేంద్రవరంలో జరిగే ‘వెన్నుపోటు పార్టీపై బీసీల గర్జన‘ కార్యక్రమం విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు అల్లి రాజబాబు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సభలో జోన్– 2 ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల వైఎస్సార్ సీపీ బీసీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొనాలన్నారు. చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటూ, ఎన్నికల సమయంలో అమలు కాని హామీలు ఇస్తూ ఏ ఒక్క హామీ అమలు చేయడం లేదన్నారు. హామీలు అమలు చేయాలని అడిగిన వారిపై రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ, తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. బీసీలకు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పెద్దపీట వేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైపే ప్రజలు ఉన్నారని బలంగా తెలిపే విధంగా ఈ భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలన్నారు.


