ఆటో నుంచి పడిపోయి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

ఆటో నుంచి పడిపోయి వ్యక్తి మృతి

Sep 26 2026 12:32 AM | Updated on Sep 26 2026 12:32 AM

అన్నవరం: ఆటోలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి రోడ్డుపై పడిపోయి, బలమైన గాయాలతో మృతి చెందాడు. అన్నవరం ఎస్సై శ్రీహరిబాబు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. తొండంగి మండలం గోపాలపట్నం గ్రామానికి చెందిన పలివెల రమణ (55) గురువారం రాత్రి తుని వెళ్లి ఆటోలో తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో అన్నవరం శివారున వన్‌ హోటల్‌ వద్ద ఆటో నుంచి కిందకు పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతడిని తుని ప్రభుత్వాసుపత్రికి తరలిస్తూండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. రమణకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. అతడు అన్నవరం దేవస్థానం శానిటరీ విభాగంలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. రమణ జీతంతోనే కుటుంబం గడుస్తోందని, అతడి మృతితో తమకు జీవనాధారం పోయిందని కుటుంబ సభ్యులు రోదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement