రాజానగరం: చదువుతో పాటు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకుంటేనే మంచి ఉద్యోగావకాశాలను పొందగలుగుతారని రాజానగరం సమీపంలోని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ (జీజీయూ) చానల్సర్ కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు) అన్నారు. క్యాంపస్‌లో శుక్రవారం జరిగిన హెచ్‌ఆర్ సదస్సులో ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఉజ్వలమైన భవిష్యత్తును అందించుటలో ఇటువంటి సదస్సులు ఎంతగానో తోడ్పడతాయన్నారు. కార్యక్రమంలో వీసీ డాక్టర్ యు.చంద్రశేఖర్, ప్రొ.వీసీ డాక్టర్ కేవీబీ రాజు, రిజిస్ట్రార్ డాక్టర్ పీఎంఎంఎస్ శర్మ, వివిధ సాఫ్ట్‌వేర్ సంస్థలకు చెందిన హెచ్‌ఆర్ నిపుణులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
లైంగిక దాడి ఘటనపైఅడిషనల్ ఎస్పీ విచారణ
తాళ్లరేవు: మండల కేంద్రమైన తాళ్లరేవు రత్సవారిపేట గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల బాలికపై ఈ నెల 20న జరిగిన లైంగిక దాడి ఘటనపై కాకినాడ అడిషనల్ ఎస్పీ ఎం.కిషోర్ కుమార్ శుక్రవారం విచారణ నిర్వహించారు. ఆ చిన్నారిపై అదే గ్రామానికి చెందిన 45 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన తెలిసిందే. ఈ దారుణంపై బాలిక అమ్మమ్మ సత్యవేణి ఫిర్యాదు మేరకు కోరంగి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. అడిషనల్ ఎస్పీ కిషోర్ కుమార్ బాలిక కుటుంబ సభ్యులు, గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించారు. ఆయన వెంట కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ, సిబ్బంది ఉన్నారు.


