నిత్యావసరాల ధరలకు అదుపేదీ? | - | Sakshi
Sakshi News home page

నిత్యావసరాల ధరలకు అదుపేదీ?

Sep 22 2026 12:12 AM | Updated on Sep 22 2026 12:12 AM

రాజమహేంద్రవరం సిటీ: మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన చంద్రబాబు పైబడిన పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు అదుపు లేకుండా పెరిగిపోతున్నాయని వైఎస్సార్‌ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన నిత్యావసర ధరలను నిరసిస్తూ రాజమహేంద్రవరం కోటగుమ్మం సెంటర్‌లో వైఎస్సార్‌ సీపీ శ్రేణులతో కలసి సోమవారం ఆయన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నూనె, గ్యాస్‌, బియ్యం, ఉల్లిపాయలు, కూరగాయలు, కరెంటు బిల్లులు ఇలా అన్నింటి ధరలను అమాంతం పెంచేసి సామాన్యులను అడ్డంగా దోచేస్తున్నారని ధ్వజమెత్తారు. పార్టీ శ్రేణులతో కలసి కూరగాయలు, ఉల్లిపాయల దండలను మెడలో వేసుకుని, గ్యాస్‌ సిలిండర్లను భుజంపై మోస్తూ.. పెరిగిన వస్తువులను బండిపై పెట్టి తోసుకుంటూ మెయిన్‌ రోడ్‌ మీదుగా ప్రదర్శన నిర్వహించారు. జగన్‌, చంద్రబాబు ప్రభుత్వాల పాలనలో ధరల వ్యత్యాసాన్ని చూపుతూ ప్లకార్డులు ప్రదర్శించారు.

పస్తులుండే రోజులు తెచ్చి..

గత ప్రభుత్వంలో బియ్యం బస్తా రూ.1,200 ఉంటే ఇప్పుడు రూ.1,800కు పెరిగిందని, పస్తులుండే రోజులు తెచ్చారని భరత్‌రామ్‌ విమర్శించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు రూపొందించిన మేనిఫెస్టోను కూడా పట్టుకోవడానికి నాటి బీజేపీ నాయకులు నిరాకరించారని, ఇప్పుడు ఇంత దారుణంగా ధరలు పెంచి దోచేస్తుంటే ఏవిధంగా మంచి ప్రభుత్వమని చెప్పుకొంటున్నారని నిలదీశారు. ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు ఇస్తామని, ఉచిత ఇసుక అంటూ చంద్రబాబు కల్లబొల్లి మాటలు చెప్పారని ధ్వజమెత్తారు. నిత్యావసరాల ధరలు తగ్గించే వరకు వైఎస్సార్‌ సీపీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి ఎందుకు ఓటేయాలో ప్రజలంతా ఆలోచించాలని కోరారు. త్వరలో జరిగే రాజమహేంద్రవరం కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను గెలిపించాలని అన్నారు. టీడీపీ అభ్యర్థులను గెలిపిస్తే ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ నిల్చోమంటే నిల్చుంటారని.. కూర్చోమంటే కూర్చుంటారని, అదే వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి కార్పొరేటర్‌ అయితే కార్పొరేషన్‌లో అధికారులను నిలదీసి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తారని చెప్పారు. ఈ రెండున్నరేళ్లు బాధ్యతాయుతమైన ప్రతిపక్షంలో ప్రజల తరఫున నిలబడి పోరాటం చేస్తామని, కూటమి ప్రభుత్వం మెడలు వంచి ధరలు తగ్గించేలా చేస్తామన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ ప్రజల తరఫున నిలబడి పెరిగిన ధరలపై పోరాటం చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఏపీ హౌసింగ్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్‌పర్సన్‌ మేడపాటి షర్మిలారెడ్డి, వైఎస్సార్‌ సీపీ నాయకులు పాల్గొన్నారు.

చంద్రబాబు ప్రభుత్వంలో గడ్డు పరిస్థితులు

ధరలు తగ్గించే వరకు

ప్రజల పక్షాన పోరాటం

జగనన్న ప్రభుత్వంలోనే రాష్ట్రం సుభిక్షం

మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement