ఇందుగలడందు లేడని సందేహము వలదు.. ఎందెందు వెదకిన అందందే గలడు చక్రి సర్వోపగతుండు అంటాడు ప్రహ్లాదుడు. భక్తాధీనుడైన భగవంతుడు భక్తుని భావమును అనుసరించి అతడు ఏ విధంగా తలస్తే ఆ రూపముగా వచ్చి అభీష్టాలు నెరవేరుస్తుంటాడు. వినాయక చవితి పండగ సందర్భంగా స్వామి వారిని విభిన్న ఆకృతులలో రూపొందించారు తయారీదారులు. సంప్రదాయ పద్ధతిలో కాకుండా వివిధ దేవతా మూర్తుల అలంకారాల్లో ఏకదంతుడిని తీర్చిదిద్దుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉత్సవ కమిటీలు ఎవరికి నచ్చిన విగ్రహాలను వారు వారి పందిళ్లలో నెలకొల్పి ప్రతిష్టిస్తున్నారు. – సాక్షి నెట్వర్క్


