ఆధార్‌ ఉంటేనే సత్రం | - | Sakshi
Sakshi News home page

ఆధార్‌ ఉంటేనే సత్రం

Aug 27 2026 12:12 AM | Updated on Aug 27 2026 12:12 AM

అన్నవరం: రత్నగిరిపై బుధ, గురువారాలలో వివాహాలు భారీగా జరగనుండడంతో సత్రం గదులకు డిమాండ్‌ ఏర్పడిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు గదుల కేటాయింపును కఠినతరం చేశారు. ఈ మేరకు ఆన్‌లైన్‌లో గదులు రిజర్వ్‌ చేయించుకున్న వారు స్వయంగా వచ్చి ఆధార్‌ చూపితేనే సత్రాన్ని కేటాయించారు. ఈ మేరకు ఈఓ నల్లం సూర్యచంద్రరావు ఏఈఓలు, సూపరింటెండెంట్లతో కమిటీ వేసి ఎవరి సిఫార్సులకూ లొంగవద్దని వారిని ఆదేశించారు.

దేవస్థానం సత్రాలలోని దాదాపు 500 గదులలో 350 నెల క్రితమే రిజర్వ్‌ అయిపోయాయి. మిగిలిన 150 గదులకు ట్రస్ట్‌ బోర్డు సభ్యుల సిఫార్సులే ఎక్కువగా ఉన్నాయి. కాగా ఆన్‌లైన్‌లో రిజర్వ్‌ చేసుకున్న గదులలో ఆధార్‌ కార్డులు చూపినవారికి 250 గదుల కేటాయించగా ఇంకా వంద మిగిలిపోయాయి. అనంతరం మిగిలిన 250 గదులకు సిఫార్సు లేఖలను పరిశీలించి 200 మందికి కేటాయించారు. దీంతో బుధవారం రాత్రికి ఇంకా 50 గదులు మిగిలాయి. రిజర్వు చేసుకున్న మరికొందరు రావాల్సి ఉందని వారు రాకుంటే సాధారణ భక్తులకు కేటాయిస్తామని అధికారులు తెలిపారు.

వసతి గది లేని వారి డార్మెటరీ

కాగా, దేవస్థానంలో వసతి గదులు లభ్యం కాని భక్తులకు ఈఓ కార్యాలయం దిగువన గల మెయిన్‌ క్యాంటీన్‌ హాలును డార్మెటరీగా మార్చి పరుపులు వేసి భక్తులకు ఉచితంగా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే వారికోసం మరుగుదొడ్లు, స్నానపుగదులు ఏర్పాటు చేసి బుధవారం నుంచి అందుబాటులోకి తీసుకువచ్చారు.

రత్నగిరిపై కొత్త నిబంధన

దళారుల ఆగడాలకు చెక్‌

ఈఓ ఆదేశాలతో కేటాయింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement