మా గ్రామంలో టీడీపీకి చెందిన ఓ వ్యక్తి నకిలీ పత్రాలు సృష్టించి, నేను సాగు చేసుకుంటున్న కొంత భూమిని ఆక్రమించుకున్నాడు. 4.92 సెంట్ల భూమిని మూడు నెలల క్రితం టీడీపీ నాయకులు అధికారులతో కుమ్మకై ్క ఇలా చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా, పట్టించుకోలేదు. మూడు నెలలుగా తిరుగుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదు.
– ఎన్.సత్యవతి, శ్రీరామపురం, కొత్తపల్లి మండలం
సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు
కాకినాడ భానుగుడి సెంటర్‌లోని ఓ కళాశాలలో చదివాను. ఆ యాజమాన్యం నా విద్యార్హత సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. నేను ఫీజు చెల్లించినా మళ్లీ రూ.60 వేలు కట్టాలని లేకుంటే సర్టిఫికెట్లు ఇచ్చేది లేదని చెబుతున్నారు. ఇప్పటికే మూడు నెలలుగా తిరుగుతున్నా, అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు.
– వి.దొరబాబు,
విద్యార్థి, కాకినాడ జగన్నాథపురం


