పట్టుజారితే ప్రమాదమని తెలిసినా పట్టించుకోవడం లేదు. తొండంగి మండలం గోపాలపట్నం నుంచి బెండపూడి జాతీయ రహదారిపై పలు వాహనాలు ఇలా ప్రమాదకరంగా ప్రయాణించాయి. బరువైన బండ రాళ్లను రవాణా చేసే సమయంలో ఇనుప రోప్‌లతో భద్రంగా తీసుకెళ్లాలి. కానీ ట్రాలీపై గ్రానైట్ రాళ్లను కట్టకుండానే తరలిస్తున్నారు. అదేవిధంగా గూడ్స్ వ్యాన్‌లో జనాన్ని ఎక్కించుకుని, కేబిన్‌పై సైతం కూర్చోబెట్టి తీసుకెళ్లారు. ఇలాంటి ప్రయాణాలను అరికట్టాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు.
– తొండంగి


