తుని రూరల్: స్థానిక లోవ దేవస్థానంలోని తలుపులమ్మ తల్లికి సప్తనదీ జలాలతో ఘనంగా సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. ఆషాఢ అమావాస్యను పురష్కరించుకుని బుధవారం పంచలోహ విగ్రహాల ప్రాంగణంలో వేదపండితులు, అర్చకులు విఘ్నేశ్వరపూజ, మండపారాధన, పవిత్ర సప్తనదీ జలాల ఆవాహన పునఃపూజలు మంగళ వాయిద్యాలు, వేదమంత్రాలతో ఆలయ ప్రాకారం చుట్టూ ప్రదక్షణలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. మూలవిరాట్‌కు ఘటాభిషేకాల అనంతరం అమ్మవారి పంచలోహ విగ్రహాలకు ధర్మకర్తలు, భక్తులు సప్తనదీ జలాలతో అభిషేకించారు. నీరాజన మంత్రపుష్పాల అనంతరం భక్తులకు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంతో తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాలు పూర్తయినట్టు ప్రకటించారు. ధర్మకర్తలు, వేలాదిగా భక్తులు పాల్గొన్నారు.
ముగిసిన ఆషాఢ మాసోత్సవాలు


