పిఠాపురంలో పవన్‌కు ఇవే చివరి ఎన్నికలు | - | Sakshi
Sakshi News home page

పిఠాపురంలో పవన్‌కు ఇవే చివరి ఎన్నికలు

Aug 12 2026 12:10 AM | Updated on Aug 12 2026 12:10 AM

పిఠాపురం: రెండేళ్లుగా నేతన్నలకు పైసా కూడా విదల్చని కూటమి ప్రభుత్వం మూడో ఏట ముచ్చటగా గతంలో కంటే ఒక రూ.వెయ్యి పెంచి నేతన్న సేవ పేరుతో నేత కార్మికులకు ఆర్థిక సహాయం చేయడానికి ఏర్పాట్లు చేసింది. అయితే ఈ పథకంలో లబ్ధిదారుల ఎంపికలో కొందరు చేతివాటానికి పాల్పతున్నారని, భారీగా ముడుపులు చెల్లిస్తేనే అర్హుల జాబితాలో పేరు ఉంటుందన్న చెబుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొందరికి నేతన్న సేవ పథకంలో నిధులు విడుదల కాగా, చాలా మంది నేత కార్మికులకు జమ కాలేదు. దీంతో తమకు ఎందుకు రాలేదని అధికారుల వద్దకు వెళితే అర్హతను బట్టి రేట్లు నిర్ధారించి, ముడుపులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

విడుదల కాని జాబితా

సాధారణంగా ఏదైనా ప్రభుత్వ పథకం నిధులు విడుదలైనప్పుడు దానికి సంబంధించిన లబ్ధిదారుల జాబితాలను వెంటనే విడుదల చేస్తుంటారు. కానీ నేతన్న సేవ పథకంలో మాత్రం నిధులు విడుదల చేసి రోజులు గడుస్తున్నా అర్హుల జాబితాలను బయటపెట్టక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. చాలామంది నేత కార్మికులు తమకు నేతన్న సేవలో డబ్బులు పడక పోవడంతో చేనేత జౌళి శాఖ అధికారులను సంప్రదిస్తే వెంటనే తమ కార్యాలయానికి రమ్మని వివరాలు నమోదు చేస్తామంటూ పిలుపు వస్తున్నట్లు చెబుతున్నారు. తీరా అక్కడకు వెళ్లాక మగ్గం ఉంటే రూ.3 వేలు, మగ్గం లేకపోతే రూ.5 వేలు వసూలు చేస్తున్నారని, అలా ముడుపులు ఇచ్చిన వారికే వివరాలు నమోదు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

కొత్త జాబితా పేరుతో..

పథకం ప్రారంభానికి ముందే అర్హుల జాబితాను తయారు చేసిన అధికారులు ఇప్పుడు కొత్తగా లిస్టులు తయారు చేస్తున్నట్టుగా చూపించి భారీగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. చాలామంది నేత పని మానేసి ఇతర వృత్తుల్లో ఉండగా వారందరి పేరున నేతన్న సేవ పథకం ఇప్పించేలా ఒక్కో లబ్ధిదారుడి నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నారని సమాచారం. అలా వారిని నేత నేస్తున్న వారిగా చూపించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.

దరఖాస్తుల స్వీకరణలోనే దోపిడీకి తెర

ఏదైనా ఒక ప్రభుత్వ పథకాన్ని అమలు చేయాలంటే లబ్ధిదారుల అర్హతలకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు ఉంటాయి. కానీ నేతన్న సేవ పథకానికి మాత్రం ప్రభుత్వం నుంచి ఎటువంటి మార్గదర్శకాలు లేవని అధికారులు చెబుతున్నారు. దీంతో పాత జాబితాలను కొనసాగిస్తారనే ప్రచారం జరుగుతోంది. నేత కార్మిక కుటుంబాలకు ఇచ్చిన ఉచిత విద్యుత్‌ పథకంలో లబ్ధిదారులకు ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. అదే జరిగితే అద్దె భవనాల్లో ఉన్న వారి పరిస్థితి ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. దీంతో పాటు ఎటువంటి నేత నేయని వారు కూడా ఉచిత విద్యుత్‌ పథకంలో ఉండడంతో అనర్హులకు లబ్ధి చేకూరుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

భారీగా వసూళ్లు

ఈ నేపథ్యంలో ఈ నెల 7వ తేదీన పథకం అమలు చేయడంతో కొందరు అధికారులు, పార్టీ నాయకులతో కలిసి వసూళ్లకు తెరలేపారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. మార్గదర్శకాలు లేకపోవడంతో తాము రాసిన వారికి మాత్రమే పథకం వస్తుందని, దానికి తగిన డబ్బులు సమర్పించుకోవాలని కొందరు సిబ్బంది బాహాటంగా చెబుతున్నట్లు సమాచారం. దీంతో ముడుపులుగా ఇచ్చిన రూ.5 వేలు పోయినా మరో రూ.20 వేలు మిగులుతుంది కదా అని అర్హత ఉన్న లబ్ధిదారులు సైతం అధికారులు అడిగిన డబ్బులు ఇస్తున్నారని చెప్పుకుంటున్నారు.

పిఠాపురం: పిఠాపురంలో అనేక ప్రజా సమస్యలు నెలకొని ఉన్నాయని, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ప్రజలకు అందుబాటులో లేకుండా ఉన్నారని, ప్రజలు బాధలు వినేవారు లేరని, ఇలాగే కొనసాగితే పవన్‌ కళ్యాణ్‌కి ఇవే చివరి ఎన్నికలు అవుతాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తాటిపాక మధు అన్నారు. సీపీఐ కాకినాడ జిల్లా 6వ రోజు పాదయాత్ర పిఠాపురంలో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభనుద్దేశించి మధు మాట్లాడుతూ పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్‌ కళ్యాణ్‌ నెగ్గితే తమ జీవితాలు మారిపోతాయని ప్రజలు ఆశించారని, నేడు అదే ప్రజలు ఎందుకు పవన్‌ కళ్యాణ్‌ని నెగ్గించుకున్నామా అని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఈ రెండున్నరేళ్ల కాలంలో పవన్‌ కళ్యాణ్‌ కేవలం ఐదారుసార్లు మాత్రమే పిఠాపురంలో ఉన్నారని తెలిపారు. మిగతా సమయం అంతా ఇతర ప్రాంతాల్లోనే గడుపుతున్నారని మధు చెప్పారు.

పవన్‌ వల్ల పిఠాపురానికి ఏం లాభం?

పేదవాడికి ఒక సెంటు స్థలం ఇవ్వలేదని, కొత్త పెన్షన్లు మంజూరు చేయలేదని, కనీసం కొత్త రేషన్‌ కార్డులు కూడా ప్రజలకు పంపిణీ చేయలేదని, మరి పవన్‌ కళ్యాణ్‌ ఎమ్మెల్యేగా ఉండడం వల్ల పిఠాపురానికి ఏం లాభం అని మధు ప్రశ్నించారు. పిఠాపురం నియోజకవర్గంలో అవినీతి రాజ్యమేలుతోందని, మైనింగ్‌, ఇసుక, మట్టి మాఫియా దందా రాత్రి సమయాల్లో జరుగుతోందని ఆయన తెలిపారు. ఉప్పాడ కొత్తపల్లిలో మత్స్యకారులకు ఇచ్చిన 100 రోజుల హామీని అమలు చేయడంలో పవన్‌ కళ్యాణ్‌ పూర్తిగా విఫలమయ్యారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పాల్గొన్నారు.

విచారణ చేస్తాం

నేతన్న సేవ పథకానికి డబ్బులు వసూలు చేస్తున్నారన్న ప్రచారంపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తాం. నేత కార్మికులెవ్వరూ ఎవరికి ఎటువంటి లంచాలు ఇవ్వనవసరం లేదు. అర్హత ఉంటే కచ్చితంగా పథకం వర్తిస్తుంది.

– సూరిబాబు,

జిల్లా చేనేత జౌళి శాఖాధికారి, కాకినాడ

ఫ రెండున్నరేళ్లలో ఒక్క ఇంటి స్థలం, రేషన్‌ కార్డు, కొత్త పెన్షన్‌ ఇవ్వలేదు

ఫ మైనింగ్‌, ఇసుక మాఫియా

రాజ్యమేలుతున్నాయి

ఫ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తాటిపాక మధు

ఫ లబ్ధిదారుల ఎంపికలో

అక్రమార్కుల చేతివాటం

ఫ అర్హత ఉంటే రూ.3 వేలు,

లేకుంటే రూ. 5 వేల వసూలు?

ఫ జాబితా బయటకు రాకుండా జాగ్రత్తలు

సహకార

సంఘాలు

23,000

నేత కార్మికులు

కుటుంబాలు

5,000

నేతపై ఉఫాధి

పొందుతున్న

కార్మికులు

40,000

మగ్గాలు

2,400

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement