దుమ్ము దులిపారు | - | Sakshi
Sakshi News home page

దుమ్ము దులిపారు

Aug 12 2026 12:10 AM | Updated on Aug 12 2026 12:10 AM

గోమాత

పులస కాదండి

మ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పులస చేపలకు ఉన్న డిమాండ్‌ అందరికీ తెలిసిందే. దీన్ని సొమ్ము చేసుకునేందుకు కొందరు వ్యాపారులు మోసానికి పాల్పడుతున్నారు. ముంబై, ఒడిశా సముద్ర ప్రాంతాలలో లభ్యమయ్యే ఇలస చేపలను కాకినాడ తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. ఇక్కడి నుంచి కొందరు దాన్ని ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లి పులసగా విక్రయిస్తున్నారు.

– కాకినాడ రూరల్‌

ధిక లోడుతో రాకపోకలు సాగిస్తున్న లారీల కారణంగా ఆ దారిలో దుమ్ము విపరీతంగా రేగుతోంది. సమీపంలోని ఇళ్లల్లోకి చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో గొల్లప్రోలు మండలం చందుర్తి గ్రామ శివారు దొడ్ల డెయిరీ వద్ద కేహెచ్‌ పేటకు చెందిన గ్రామస్తులు గ్రావెల్‌తో వెళుతున్న సుమారు 20 లారీలను మంగళవారం అడ్డుకున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.

– గొల్లప్రోలు (పిఠాపురం రూరల్‌)

సాధారణంగా ఆవులు తమ పిల్లలకు పాలివ్వడం అందరూ చూస్తుంటాం. కానీ ఓ గోమాత తన దూడతో కలిపి నాలుగింటికి పాలు ఇచ్చి, వాటి ఆకలి తీర్చింది. కాకినాడ రూరల్‌ మండలం రమణయ్యపేట కూరగాయల మార్కెట్‌లో మంగళవారం ఈ దృశ్యం కనిపించింది. అందుకేనేమో ఆవును గోమాత అని తల్లితో పోల్చుతారు.

– కాకినాడ రూరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement