ఏకగ్రీవంగా నూతన కార్యవర్గం | - | Sakshi
Sakshi News home page

ఏకగ్రీవంగా నూతన కార్యవర్గం

Aug 12 2026 12:10 AM | Updated on Aug 12 2026 12:10 AM

ఏకగ్రీవంగా నూతన కార్యవర్గం

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (ఏపీఆర్‌ఎస్‌ఏ) కాకినాడ జిల్లా కలెక్టరేట్‌ యూనిట్‌కు 2026–29 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రకారం నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన అనంతరం ప్రతి పదవికి ఒక్క నామినేషన్‌ మాత్రమే దాఖలు కావడంతో ఎటువంటి ఉపసంహరణలు లేకుండా కార్యవర్గం ఏర్పాటైంది. ఎన్నికల అధికారిగా అసోసియేషన్‌ కాకినాడ డివిజన్‌ అధ్యక్షుడు డి.కృష్ణ, సహాయ ఎన్నికల అధికారిగా అసోసియేషన్‌ నాయకులు ఆర్‌.కల్యాణ్‌ చక్రవర్తి, ఎస్‌.రామ్‌ మోహన్‌ వ్యవహరించారు. అసోసియేషన్‌ నూతన అధ్యక్షుడిగా ఎం.విజయ్‌ కుమార్‌, అసోసియేట్‌ ప్రెసిడెంట్‌గా ఎం.శివరామకృష్ణ, ఉపాధ్యక్షులుగా ఎ.దీపక్‌ కుమార్‌, జీపీ రఘుపతిరావు, మహిళాఉపాధ్యక్షురాలుగా ఎన్‌వీ రమ్య, సెక్రటరీగా ఎం.శివకుమార్‌ నాయుడు, జాయింట్‌ సెక్రటరీలుగా ఆర్‌.సుధా మాధురి, ఎస్‌.షణ్ముఖ శ్రీనివాస్‌, రిజర్వ్‌ జాయింట్‌ సెక్రటరీగా ముక్కె రామకృష్ణ, కోశాధికారిగా కె. సతీష్‌ నాయుడు ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గాన్ని ఏపీఆర్‌ఎస్‌ఏ జిల్లా అధ్యక్షుడు పితాని త్రినాథరావు, సహాధ్యక్షులు చంద్రశేఖర్‌ రెడ్డి, రమేష్‌, జగ్గంపేట తహసీల్దార్‌ ఎం.పార్థసారథి అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement