క్రీడా పోటీల నిర్వహణపై సమీక్ష | - | Sakshi
Sakshi News home page

క్రీడా పోటీల నిర్వహణపై సమీక్ష

Aug 8 2026 12:29 AM | Updated on Aug 8 2026 12:29 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): అమరావతి చాంపియన్‌ షిప్‌– 2026 జిల్లా స్థాయి టోర్నమెంట్‌ ఎంపిక పోటీలు ఈ నెల 12, 13 తేదీల్లో విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్‌లో శుక్రవారం శాప్‌ ఆధ్వర్యంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ నిర్వహించనున్న ఈ పోటీల నిర్వహణపై ఆయన సమీక్షించారు. ఈ పోటీల్లో ఏడు నియోజకవర్గాలకు సంబంధించి అండర్‌– 17, 23 బాల బాలికలు సుమారు 1,500 వరకు పాల్గొంటారన్నారు. 12న బాలికలకు, 13న బాలురకు క్రీడలు నిర్వహిస్తారన్నారు. విజేతలు ఈ నెల 19 తేదీ నుంచి రాష్ట్ర స్థాయిలో తిరుపతిలో నిర్వహించే పోటీల్లో పాల్గొంటారన్నారు. డీఎస్‌డీఓ వసతి భోజన ఏర్పాట్లను పర్యవేక్షించాలన్నారు.

ఫ వీబీజీ రాంజీ పథకాన్ని అటవీ శాఖ, డీఆర్‌డీఏ సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకువెళ్లాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉపాధి కల్పించేలా, దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూర్చే పండ్లు ఇచ్చే మొక్కలు, వెదురు తోటల పెంపకాన్ని చేపట్టాలన్నారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్‌ ప్రియా, జిల్లా అటవీ శాఖ అధికారి రామచంద్రరావు, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసరావు, డ్వామా పీడీ ఎస్‌.మధుసూదన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement