నీరు వస్తుందని చెబితే నారుమళ్లు వేశాం. ఇప్పుడు నీరందక అవి ఎండిపోతున్నాయి. నీటి గురించి అడుగుదామంటే అధికారులు కంటికి కనిపించడం లేదు. వేసిన నారుమళ్లకు మోటార్ల ద్వారా నీరు పెడదామంటే కాలువల్లో మురికి నీరు వస్తోంది. ఈ ప్రభుత్వం రైతులను నిలువునా నట్టేట ముంచింది.
– తటవర్తి రామన్నదొర, మల్లవరం, గొల్లప్రోలు మండలం
ఇలాగైతే ఖరీఫ్ లేనట్టే
నీరు రాకపోవడంతో చాలామంది రైతులు నారుమళ్లు వేయడం ఆపేశారు. ఇలాంటి దారుణ పరిస్థితి మునుపెన్నడూ చూడలేదు. ఎవరు అధికారంలో ఉన్నా కనీసం నారుమళ్లకు సరిపడా నీరు ఇచ్చేవారు. ఉపముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే సాగునీటి ఎద్దడి నెలకొంది. ఇదే పరిస్థితి మరో 15 రోజులు కొనసాగితే ఇక ఖరీఫ్ సాగు లేనట్టే.
– దాసరి సత్యనారాయణ, మల్లవరం, గొల్లప్రోలు మండలం
నట్టేట ముంచారు
నారు వేసుకోమని చెప్పి, నీరు ఇవ్వడం మానేశారు. వేసిన నారు ఎండిపోతోంది. రూ.వేల పెట్టుబడి నేలపాలవుతోంది. ఎవరికి చెప్పాలో తెలియని అయోమయ పరిస్థితిలో రైతులున్నారు. ఇంత ఇబ్బంది పడుతున్నా నారు వేసుకోమన్న అధికారులు, ప్రజాప్రతినిధులు కనిపించడం లేదు.
– అడపా ఐరాజు, భోగాపురం, పిఠాపురం మండలం
●


