పిఠాపురం రూరల్: మండలంలోని నరశింగపురం జగనన్న కాలనీలో పంచాయతీరాజ్ అండ్ ఇంజినీరింగ్ ఽశాఖ ఆధ్వర్యంలో రూ.11.10 లక్షల ఉపాధి నిధులతో నిర్మించిన సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టిన కొద్దిరోజులకే ముక్కలైంది. ఎఫ్‌కే పాలెం గ్రామ శివారున రూ.10 లక్షలతో నిర్మించిన నూతన సీసీ రోడ్డు బీటలు వారింది. ఈ విషయాలపై ఆయా గ్రామాల ప్రజలు ఇచ్చిన సమాచారం మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలించి రోడ్లపై నాణ్యతపై ‘లక్షలతో రోడ్లు.. లక్ష్యానికి బీటలు’ శీర్షికతో ఈ నెల 7న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి సంబంధిత శాఖ అధికారులు స్పందించారు. ఆయా రోడ్లలో లోపాలను గుర్తించి అవసరమైన చోట పునర్నిర్మాణం చేపట్టారు.


