అలంపూర్: అలంపూర్‌కు అదనపు కోర్టు మంజూరైనట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసులు, మాజీ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది నారాయణరెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక జూనియర్ సివిల్ కోర్టులోని న్యాయవాదుల సమావేశ మందిరంలో అదనపు కోర్టు రావడంపై న్యాయవాదులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకొన్నారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు శోభారాణి, నారాయణరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, తిమ్మారెడ్డి, నాగరాజ్‌యాదవ్, ఆంజనేయులు, మధు, గజేందర్‌గౌడు, హుస్సేన్, వెంకటేష్, భీమేష్‌గౌడు, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో
పద్మనాభస్వామి వ్రతం
ధరూరు/మల్దకల్ : మండల పరిధిలోని పెద్ద చింతరేవుల ఆంజనేయస్వామి ఆలయంలో అనంత పద్మనాభస్వామి వ్రతం శుక్రవారం కనుల పండువగా జరిపించారు. ఉడిపి పీఠాధిపతులతో వేద యుక్తంగా పూజలను నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఆద్య చక్రవర్తి కేశవాచార్యులు తెలిపారు. ఉడిపి పలిమారు మఠం పీఠాధిపతులు విద్యాదీశ తీర్థ శ్రీపాదులు, రాజేశ్వర తీర్థ శ్రీపాదులు ముందుగా మూల రాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆంజనేయ స్వామి వారికి సంస్థాన పూజ, నవగ్రహ పూజ, పవమాన హోమాలు, జంట ఆవులకు గోపూజలు జరిపించారు. అనంతరం పద్మనాభ స్వామి వ్రతం నిర్వహించి కుటుంబసమేతంగా సుఖ సంతోషాలతో ఉండాలని పూజలు చేశారు. కా ర్యక్రమానికి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొ న్నారు. పూజల్లో గద్వాల బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి బాసు హనుమంతు నాయుడు దంపతులు ప్రత్యేక పూజలు జరిపించారు.
బాల్యవివాహాల
నిర్మూలనకు కృషిచేయాలి
గద్వాల: బాల్యవివాహాల నిర్మూలనకు కృషి చేయాలని, బాల్య వివాహ్ ముక్త్ భారత్ పోర్టల్‌పై పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంక్షేమ అధికారి జిల్లా అధికారి సునంద అన్నారు. శువ్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. జిల్లాలో బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించి బాలికలకు విద్య, ఆరోగ్యం, భద్రత మెరుగైన భవిష్యత్ అందించేందుకు గ్రామస్థాయి నుంచే సమన్వయంతో పనిచేయాలన్నారు. గ్రామాల్లో బాలల పరిరక్షణ కమిటీల ద్వారా బాల్య వివాహాల నివారణకు చర్యలు చేపట్టాలని, సమాచారం అందిన వెంటనే అధికారులకు తెలియజేసి వివాహాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే గ్రామంలో జరిగే ప్రతి వివాహాన్ని తప్పనిసరిగా నమోదు చేయాలని తద్వారా బాల్య వివాహాలను గుర్తించి నివారించడంలో సహాయపడుతుందని చెప్పారు. బీవీఎంబీలో భాగంగా గ్రామసభలు నిర్వహించి బాల్యవివాహ రహిత గ్రామాలుగా తీర్మానం చేసి వివరాలను బీవీఎంబీ పోర్టల్ (ట్టౌ ఞఛిజిజీ ఛీఝ్చటటజ్చీజ్ఛ.ఠ్ఛీఛీ.జౌఠి.జీ ుఽ)లో అప్‌లోడ్ చేయాలని, అన్ని గ్రామాలను అక్టోబర్ 2న బాల్యవివాహా నిరోధక ఽఅధికారులు (సీఎంపీఓ) బాల్య వివాహ రహిత గ్రామాలుగా ప్రకటించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ ముసాయిదాబేగం, డీపీఓ శ్రీరాం, డీసీపీఓ నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
80 క్వింటాళ్ల వేరుశనగ
గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు శుక్రవారం 80 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. కాగా క్వింటాల్ గరిష్టంగా రూ.7,901, కనిష్టంగా రూ.3,889, సరాసరిగా రూ.4,479 ధరలు లభించాయి. అలాగే 3 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. క్వింటా రూ.7,151 ఒకే ధర పలికింది.


