అలంపూర్ : పెండింగ్ ప్రాజెక్టుల సాధనకు ఈనెల 27న చేపట్టనున్న పాదయాత్రను విజయవంతం చేద్దామని పెండింగ్ ప్రాజెక్టుల సాధన సమితి నియోజకవర్గ జేఏసీ చైర్మన్ రామ్మోహన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు అలంపూర్ చౌరస్తాలోని జాతీయరహదారి నాలుగు రోడ్ల కూడలిలో శుక్రవారం పాదయాత్ర పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ మాట్లాడుతూ....ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలన్నారు. రైతులకు న్యాయం చేయడానికి చర్యలు చేపట్టాలన్నారు. చంద్రసాగర్, అమ్రాబాద్, జూరాల, గట్టు, శేరుపల్లి ప్రాంతాల్లో ఎత్తిపోతల పథకాలు నిర్మించాలన్నారు. జీఓ 72తో తంగడి లిఫ్ట్ పథకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లక్ష్మిదేవిపల్లి రిజర్వాయర్, వెల్టూరు. గొందిమల్ల బ్యారేజీల నిర్మించాలన్నారు. చిన్నోనుపల్లి రిజర్వాయర్ నుంచి ఆర్డీఎస్ కాలువకు సాగునీరు అందించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న 99, 100 ప్యాకేజీల పనులు పూర్తి చేయాలన్నారు. పీఆర్‌ఎల్‌ఐ నీటిని నలగొండకు తరలించే ఎత్తిపోతల పథకాన్ని రద్దు చేయాలన్నారు.ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు జూరాల నుంచి నీటిని సాగు నీరు విడదల చేయాలన్నారు. రైతులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తన హజరై జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జేఏసీ వైస్ చైర్మన్ గోపాల్‌రెడ్డి, సర్పంచ్ గొంగోళ్ల ఈశ్వర్, మాజీ సర్పంచ్ శేషన్ గౌడు, రైతులు రంగస్వామి, సుబ్బారెడ్డి, హీరోజీరావు ఉన్నారు.


