గద్వాల: ఫిర్యాదుల పరిష్కారానికి ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ప్రహసనంగా మారింది. తమ సమస్యలకు పరిష్కారం చూపెడతారంటూ గంపెడాశతో వచ్చే ఫిర్యాదుదారుల సమస్యలు బుట్టదాఖలవుతున్నాయి. దీనిపై కలెక్టర్ రిజ్వాన్‌బాషాషేక్ హెచ్చరిస్తూ, ప్రతి సోమవారం అన్ని మండలాల తహసీల్దార్ కార్యాలయాల్లో ఫిర్యాదుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ ఫిర్యాదు మాత్రం పరిష్కారానికి నోచుకోలేకపోతున్నాయి. దీనిద్వారా ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని వచ్చిన ఫిర్యాదులను కచ్చితంగా పరిష్కారం చూపాలని కలెక్టర్ హెచ్చరించినా.. కొన్ని మండలాల్లో అధికారులు తీరు మార్చుకోవడం లేదు.
తాజాగా 32 అర్జీలు..
సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్లు మధుమోహన్, నర్సింగ్‌రావు ప్రజావాణిని నిర్వహించి.. ప్రజల నుంచి 32 ఫిర్యాదులు స్వీకరించారు. అదేవిధంగా మండలాల స్థాయిలో నిర్వహించే ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ప్రజావాణి పోర్టల్‌లో ఫిర్యాదుల వివరాలను అప్‌లోడ్ చేస్తుండడంతో రాష్ట్రస్థాయిలోనూ ఉన్నతాధికారులు వీటిని పర్యవేక్షిస్తుంటరన్నారని, వెంటనే సమీక్ష సమావేశాలు నిర్వహించి ఫిర్యాదులను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫిర్యాదులకు పరిష్కారం చూపకుండా పెండింగ్‌లో ఉంచితే షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు.
పరిష్కారానికి నోచుకోని
ప్రజావాణి దరఖాస్తులు
కలెక్టర్ హెచ్చరించినా
తీరు మార్చుకోని అధికారులు
ఇళ్లు, భూమి, పింఛన్
సమస్యలపైనే అర్జీలు


