తెరుచుకోని రైల్వే గేట్‌ | - | Sakshi
Sakshi News home page

తెరుచుకోని రైల్వే గేట్‌

Sep 22 2026 12:42 AM | Updated on Sep 22 2026 12:42 AM

ఫ్లై ఓవరే ఏకై క పరిష్కారం..

కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు

ఇబ్బందులు ఎదుర్కొన్న

ప్రయాణికులు

మదనాపురం: రైల్వేగేట్‌కు సాంకేతిక సమస్య.. వేలాది మంది ప్రయాణికులకు అరగంటపాటు చుక్కలు చూపించింది. సోమవారం సాయంత్రం 5:25 గంటల సమయంలో మదనాపురం సమీపంలోని ప్రధాన రైల్వేగేట్‌ ఒక్కసారిగా మొరాయించడంతో వనపర్తి–ఆత్మకూరు రహదారిపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గేటుకు ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

అసలేం జరిగింది?

సాయంత్రం కాచిగూడ నుంచి తిరుపతి వెళ్లే ఎక్స్‌ప్రెస్‌, (ట్యూటికోరిన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు) వెళ్లిన అనంతరం గేటు తీసేక్రమంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో గేట్లు పైకి లేవలేదు. విషయం తెలుసుకున్న సిగ్నల్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ బాల్‌రాజు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, దాదాపు అరగంటపాటు శ్రమించి సమస్యను సరిచేశారు. అనంతరం గేట్లు ఎత్తడంతో ట్రాఫిక్‌ నెమ్మదిగా పునరుద్ధరించబడింది. దీనిపై స్టేషన్‌ మాస్టర్‌ వీరన్నను వివరణ కోరగా.. కేవలం సాంకేతిక లోపం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని వెల్లడించారు.

కీలకమైన రహదారి.. నిత్యం రాకపోకల రోదసి

ఈ రహదారి సాధారణమైనది కాదు. జిల్లా కేంద్రమైన వనపర్తి నుంచి ఆత్మకూరు, చిన్నచింతకుంట మండలాలకు మాత్రమే కాకుండా, మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాల్లోని పలు ప్రాంతాలకు అనుసంధానంగా ఉన్న ప్రధాన లింక్‌ రోడ్డు. నేషనల్‌ హైవేకు దగ్గర ఉండడంతో ప్రతిరోజూ వందలాది ఆటోలు, బస్సులు, ప్రైవేటు వాహనాలు దీనిపై నుంచే వెళ్తుంటాయి. అంతేకాకుండా ప్రముఖ పుణ్యక్షేత్రం కురుమూర్తి స్వామి ఆలయానికి వెళ్లే భక్తుల వాహన రద్దీ ఈ మార్గంలో నిత్యం అధికంగా ఉంటుంది.

పదేపదే గేట్లు పడటం, ట్రాఫిక్‌ స్తంభించిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ వెంటనే రైల్వే ఓవర్‌ బ్రిడ్జి (ఆర్‌ఓబీ) నిర్మాణం చేపడితేనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని స్థానికులు, ప్రయాణికులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement