‘సర్‌’ను త్వరితగతిన పూర్తిచేయాలి | - | Sakshi
Sakshi News home page

‘సర్‌’ను త్వరితగతిన పూర్తిచేయాలి

Sep 22 2026 12:42 AM | Updated on Sep 22 2026 12:42 AM

గద్వాల: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా జారీ చేసిన నోటీసులకు (నోమ్యాపింగ్‌, అనామలీస్‌) సంబంధించిన పెండింగ్‌ హియరింగ్స్‌ను త్వరితగతిన పూర్తి చేసి అర్హత కలిగిన ఓటర్ల వివరాలను తుది ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణకు సిద్ధం చేయాలని కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌ అన్నారు. సోమవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి నిర్వహించిన వీసీలో పాల్గొని అనంతరం జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నోటీసులు అందుకున్న ప్రతి ఓటరుకు సంబంధించిన విచారణను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. విచారణకు హాజరైన ఓటర్ల నుంచి అవసరమైన పత్రాలను స్వీకరించి వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం వివరాలను సంబంధిత యాప్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. అన్ని వివరాలు సక్రమంగా ఉన్న ఓటర్ల దరఖాస్తులను పరిశీలించి పూర్తి చేయాలని, అలాగే ఫారం–6, 7, 8 దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ మధుమోహన్‌, ఆర్డీఓ శ్రీనివాసరావు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.

నిర్వాసితులకు పరిహారం..

జిల్లాలో ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ, నిర్వాసితులకు పునరావాస కేంద్రాల్లో అవసరమైన మౌళిక వసతుల ఏర్పాటుకు భూములు కోల్పోయిన రైతులకు పరిహారం అందజేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎస్‌ సంజయ్‌జాజు నిర్వహించిన వీసీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ నెట్టెంపాడు, గట్టు ఎత్తిపోతలతోపాటు మల్లమ్మకుంట రిజర్వాయర్‌ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ నిమిత్తం రైతులను ఒప్పించి ముందుకెళ్తున్నామన్నారు. భూసేకరణ పూర్తయిన రైతులకు అవార్డు పాస్‌ చేసి పరిహారం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

తహసీల్దార్‌ కార్యాలయం తనిఖీ

ఎర్రవల్లి: తహసీల్దార్‌ కార్యాలయాన్ని కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌ ఆకస్మికంగా సందర్శించి పలు రికార్డులు తనిఖీ చేశారు. భూ భారతి, సాదాబైనామా దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement