వేలం పాటలతో రూ.84.18 లక్షల ఆదాయం | - | Sakshi
Sakshi News home page

వేలం పాటలతో రూ.84.18 లక్షల ఆదాయం

Sep 22 2026 12:42 AM | Updated on Sep 22 2026 12:42 AM

అలంపూర్‌: అలంపూర్‌ క్షేత్ర ఆలయాలకు సంబంధించిన వేలంపాటలు ముగిసినట్లు ఈఓ దీప్తిరెడ్డి తెలిపారు. జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో సోమవారం 9 రకాల సీల్డ్‌ కవర్‌ ఆన్‌లైన్‌ బహిరంగ వేలం పాటలు నిర్వహించగా.. ఫొటోలు, క్యాసెట్లు అమ్ముకునే హక్కును అలంపూర్‌కు చెందిన వెంకట్రామరెడ్డి రూ.29.55 లక్షలకు దక్కించుకున్నారు. అలాగే కొబ్బెర చిప్పలు నల్లగొండకు చెందిన శ్రీనివాసరావు రూ.18,18 లక్షలకు, శౌచాలయాల నిర్వహణ అలంపూర్‌కు చెందిన శివరాముడు రూ.9.16 లక్షలకు, క్యాంటీన్‌ అలంపూర్‌కు చెందిన నరేందర్‌రెడ్డి రూ.9.29 లక్షలకు, డాలర్లు, కంకణాలు అమ్మకం బీచుపల్లికి చెందిన నరేష్‌గౌడ్‌ రూ.18 లక్షలకు కై వసం చేసుకున్నారు. వేలం ద్వారా మొత్తం రూ.84.18 లక్షల ఆదాయం సమకూరింది. గతేడాది రూ.70.96 లక్షల ఆదాయం రాగా.. ఈసారి రూ.13.21 లక్షలు అదనంగా వచ్చింది. అయితే ఈ సారి కొత్తగా నిర్వహించిన మొబైల్స్‌, లగేజీ డిపాజిట్‌ కౌంటర్‌ నిర్వహణను అలంపూర్‌కు చెందిన సుబ్రమణ్యంకుమార్‌ రూ.6.10 లక్షలకు దక్కించుకున్నారు. వివిధ కారణాలతో టెంకాయలు, పూజా సామగ్రి అమ్మకం, చీరలు, ఒడిబియ్యం సేకరణ వేలంలో తక్కువ మంది పాల్గొనడంతో వాటిని వాయిదా వేసినట్లు వివరించారు. కార్యక్రమంలో కురుమూర్తిస్వామి ఆలయ ఈఓ మదనేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement