మట్టి గణపతులను పూజిద్దాం | - | Sakshi
Sakshi News home page

మట్టి గణపతులను పూజిద్దాం

Sep 12 2026 1:00 AM | Updated on Sep 12 2026 1:00 AM

అలంపూర్‌: పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులను ప్రతిష్ఠించి పూజించాలని ప్రముఖ సంగీత దర్శకుడు వీడీ శ్రీకాంత్‌ దేవా పిలుపునిచ్చారు. అలంపూర్‌ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి క్షేత్రంలో శుక్రవారం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించగా.. దేవాదాయ, ధర్మాదాయశాఖ ప్రోత్సాహంతో సంగీత దర్శకుడు శ్రీకాంత్‌ దేవా, గాయకులు మహతి, లక్ష్మీగాయంత్రి హాజరయ్యారు ఈ సందర్భంగా తమ పాటల ద్వారా పర్యావరణంపై అవగాహన కల్పించారు. భక్తులు మట్టి వినాయకులను ప్రతిష్ఠించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కోరారు. ఆలయాల్లో పర్యావరణ పరిరక్షణకు సహకరించిన ఈఓ దీప్తికి వారు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement