–8లో u
అయిజ: తెల్లబంగారం ఎర్రబారుతోంది. కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు పెరగడంతో పంటపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జిల్లాలో ఈ సారి రైతులు 1,72,572 ఎకరాల్లో పత్తిసాగు చేశారు. అయితే పగలు ఎండ ఎక్కువగా ఉండటం.. రాత్రి ఉష్ణోగ్రతలు పెరగడంతో పంటపై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతోంది. దీనికి తోడు రసంపీల్చే పురుగులు, దోమలు (జాసీడ్స్) వంటి కీటకాలు దాడి చేయడంతో పంట మరింత వేగంగా దెబ్బతింటోంది. జిల్లాలోని అనేక శివార్లలో పత్తిపంట ఎర్రబారి కనిపిస్తోంది. మొదట ఆకులు పసుపు రంగులోకి మారి, తర్వాత గులాబీ ఎరుపు రంగును సంతరించుకుని రాలిపోతున్నాయి. కాయలు తెరుచుకుని తెల్లని పత్తి కనిపించిన్పటికీ.. ఆకులు రాలడం ద్వారా దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అయితే రైతులు దీన్ని ఎర్ర తెగులుగా భావిస్తున్నారు. భయపడి నీరు కడితే మొత్తం పంటకు వ్యాపిస్తుందని.. నీటి తడులు పెట్టడం ఆపేస్తున్నారు.
అలంపూర్ 2,090
ధరూరు 4.630
గద్వాల 14,200
గట్టు 14,408
అయిజ 21,525
ఇటిక్యాల 13,170
కేటీదొడ్డి 6,050
మల్దకల్ 27,488
మానవపాడు 21,485
రాజోళి 9,400
ఉండవెల్లి 10,244
వడ్డేపల్లి 19,075
ఎర్రవల్లి 8,807
అధిక ఉష్ణోగ్రతలతో
రంగు మారుతున్న తెల్లబంగారం
పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం
ఆందోళనలో పత్తి రైతులు
జిల్లావ్యాప్తంగా
1,72,572 ఎకరాల్లో సాగు


