ఐదు రోజుల పనిదినాలు కల్పించాలని సమ్మె | - | Sakshi
Sakshi News home page

ఐదు రోజుల పనిదినాలు కల్పించాలని సమ్మె

Sep 12 2026 1:00 AM | Updated on Sep 12 2026 1:00 AM

ర్యాలీ నిర్వహిస్తున్న బ్యాంకు ఉద్యోగులు

గద్వాలన్యూటౌన్‌: వారానికి ఐదు రోజుల పనిదినాలను కల్పించాలని బ్యాంకు ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో వాణిజ్య బ్యాంకులతోపా టు గ్రామీణ బ్యాంకుల ఉద్యోగులు సమ్మె చేపట్టా రు. ఈ సందర్భంగా స్థానిక ఎస్‌బీఐ నుంచి యూ బీఐ వరకు ర్యాలీ నిర్వహించారు.అనంతరం యూ నియన్‌ నాయకులు ప్రభాకర్‌రెడ్డి, రవికుమార్‌, కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. బ్యాంకు ఉద్యోగులకు ఐదు రోజుల పనిదినాల విధానాన్ని అమలు చేయాలనే తమ డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. ఈ విధానం అమలైతే ఉద్యోగుల పని–వ్యక్తిగత జీవన సమతుల్యత మెరుగుపడటంతో పాటు మరింత ఉత్పాహంతో ఖాతా దారులకు మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుందన్నారు. తమ న్యాయమైన డిమాండ్‌ను నెరవేర్చాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు సందీప్‌, దిల్కరన్‌, శ్రీకాంత్‌రెడ్డి, విజయ్‌కుమార్‌, విశ్వేశ్వర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement