ఇటీవల ఎన్‌సీడీ ప్రోగాం ద్వారా జిల్లావ్యాప్తంగా సర్వే నిర్వహించాం. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రక్త పరీక్షలు చేయించాం. ఇందులో వివిధ రోగాల బారినపడిన వారిలో 30 ఏళ్లు పైబడిన వారు కూడా ఉండడం వెలుగులోకి వచ్చింది. మారుతున్న ఆహారపు అలవాట్లు, మద్యం, ఒత్తిళ్లు, ఇతర సమస్యల కారణంగా రక్తపోటు, మధుమేహంతో ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వంశపరంగా వచ్చే సమస్యలు ఉంటున్నాయి. సమ్యసలతో ఇబ్బందులు పడుతున్న వారికి జిల్లా ఆస్పత్రితోపాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలో పరీక్షలు నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తున్నాం. ప్రతి ఒక్కరు నడక లేదా వ్యాయామం చేయాలి. సరైన సమయంలో నిద్రకు ఉపక్రమించాలి.
– సంధ్యాకిరణ్మయి, ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ
●


