విద్యావ్యవస్థలో దోపిడీని అరికట్టాలి | - | Sakshi
Sakshi News home page

విద్యావ్యవస్థలో దోపిడీని అరికట్టాలి

Aug 13 2026 1:15 AM | Updated on Aug 13 2026 1:15 AM

గద్వాల: విద్యావ్యవస్థలో దోపిడీని అరికట్టినప్పుడే అట్టడగు స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరికీ మెరుగైన విద్య అందుతుందని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఆంజనేయులు అన్నారు. బుధవారం ఏఐఎస్‌ఎఫ్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి చౌరస్తాలో భగత్‌సింగ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి, జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్య, ఉపాధి హక్కుల సాధన, శాసీ్త్రయ విద్యావిధానం అమలు కోసం ఏఐఎస్‌ఎఫ్‌ నిరంతర పోరాటాలు నిర్వహిస్తోందన్నారు. విద్యార్థులందరికీ ఉచితంగా మెరుగైన విద్య అందించే విద్యావిధానం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో గంగాధర్‌, సురేందర్‌, గురుస్వామి, భీమరాజు, శివకుమార్‌, రాఘవేంద్ర, రమేశ్‌, రాజు, శివ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement