ఎర్రవల్లి: బీచుపల్లి క్షేత్రానికి బుధవారం భక్తులు పోటెత్తారు. అమావాస్య సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి.. అభయాంజనేయస్వామి దర్శనానికి క్యూ కట్టారు. భక్తులతో ఆలయం రద్దీగా మారింది. ఆలయ ప్రధాన అర్చకులు అంజన్నకు ప్రత్యేక పుష్పాలంకరణ, ఆకుపూజ, అభిషేకం, మహా మంగళహారతి వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఆలయ పాలకమండలి ఆధ్వర్యంలో వ్యాసరాయల కల్యాణ మండపంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ పురేందర్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.


