ధాన్యం సేకరణకు పక్కా ప్రణాళికలు | - | Sakshi
Sakshi News home page

ధాన్యం సేకరణకు పక్కా ప్రణాళికలు

Aug 13 2026 1:15 AM | Updated on Aug 13 2026 1:15 AM

గద్వాల: ఏటా ప్రభుత్వమే వరిధాన్యాన్ని కొను గోలు చేస్తున్న నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసేందుకు పక్కా ప్రణాళికలు అవసరమని అదనపు కలెక్టర్‌ మధుమోహన్‌ అన్నారు. బుధవారం ఐడీఓసీలోని తన చాంబర్‌లో ఽఅధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లా డారు. గత సీజన్‌లో తలెత్తిన సమస్యలను దృష్టిలో ఉంచుకొని.. ఈసారి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమగ్ర కార్యాచరణతో ముందుకెళ్లాలని సూ చించారు. వానాకాలంలో వరిసాగు విస్తీర్ణాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్ని మెట్రిక్‌ టన్నుల ధా న్యం ఉత్పత్తి అవుతుందనే అంచనాతో అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఎస్‌వో స్వామికుమార్‌, డీఎం విమ ల, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీ ప్రశాంత్‌, మార్కెటింగ్‌శాఖ అఽఽధికారి పుష్పమ్మ ఉన్నారు.

ప్రియాంక కుటుంబానికి రూ.20 లక్షల సాయం

అయిజ: ఇటీవల మృతిచెందిన వైద్య విద్యార్థిని ప్రియాంక కుటుంబానికి రాజమండ్రి మెడికల్‌ కళాశాల యాజమాన్యం రూ. 20 లక్షల ఆర్థికసాయం అందజేశారు. బుధవారం వైద్య కళాశాల నుంచి డాక్టర్లు తరుణ్‌, సాధిక, ప్రొఫెసర్‌ సుభాషిని మండలంలోని ఎక్లాస్‌పు రం గ్రామానికి చేరుకొని ప్రియాంక తల్లిదండ్రులను ఓదార్చారు. అనంతరం రూ. 20 లక్షల చెక్కు అందించి, భవిష్యత్‌లో కూడా కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.

గుప్తనిధుల కోసం

మళ్లీ తవ్వకాలు

గట్టు: గుప్త నిధుల కోసం మళ్లీ తవ్వకాలు చేపట్టారు. మండల కేంద్రంలోని బిచ్చాలపేట మసీదు పక్కనే ఇది వరకు గుప్త నిధుల కోసం తవ్విన ప్రాంతానికి కొద్ది దూరంలోనే మళ్లీ తవ్వకాలు జరిపిన వ్యవహారం బుధవారం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో పెద్ద ఎత్తు న గుప్త నిధులు లభించాయని ప్రచారం జరి గింది. అయితే నేతాజీ సర్కిల్‌ ప్రాంతంలో ఓ పాత ఇంటి గోడను కూలగొడుతున్న క్ర మంలో 1882 కాలం నాటి వెండి నాణెలు, బంగారం బయట పడగా.. కూలీల మధ్య పంపకాల్లో తేడాలు రావడంతో బయటకు పొక్కిన విషయం తెలిసిందే. 72 నాణెల్లో ఇప్పటి వరకు 54 నాణెలతో పాటుగా రెండు బంగారం ము క్కలను పోలీస్‌, రెవెన్యూ అధికారులు స్వాధీ నం చేసుకున్నారు. ఇదిలా ఉండగానే.. మళ్లీ బిచ్చాలపేటలో గుప్తనిధుల కోసం పాడుబడిన ప్రాంతంలో తవ్వకాలు జరిపిన వ్యవహారం చర్చాంశనీయంగా మారింది. అయితే పోలీసు లు సరైన విచారణ చేపట్టడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసుల నిర్లక్ష్యంతో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement