పోక్సో కేసుల్లో నిందితులకు వరుస శిక్షలు | - | Sakshi
Sakshi News home page

పోక్సో కేసుల్లో నిందితులకు వరుస శిక్షలు

Aug 13 2026 1:15 AM | Updated on Aug 13 2026 1:15 AM

పోలీసు, న్యాయశాఖ సిబ్బందిని అభినందించిన ఎస్పీ శ్రీనివాసరావు

గద్వాల క్రైం/ఎర్రవల్లి: రెండు నెలల వ్యవధిలోనే నాలుగు పోక్సో కేసుల్లో దోషులకు జైలుశిక్ష అమ లుకు కృషిచేసిన పోలీసు, న్యాయశాఖ సిబ్బందిని ఎస్పీ శ్రీనివాసరావు ప్రత్యేకంగా ఆభినందించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అలంపూర్‌, కేటీదొడ్డి, రాజోళి, శాంతినగర్‌ పోలీస్‌స్టేషన్‌ల్లో నమోదైన పోక్సో కేసుల్లోని నిందితులకు న్యాయశాఖ ద్వారా శిక్షలు పడేలా కృషిచేయడం అభినందనీయమన్నారు. బాధితుల తరుఫున వాదనలు వినిపించడం.. సాక్షులను కోర్టులో హాజరుపర్చడంతో నిందితులకు వరుసగా జైలుశిక్షలను ఖరారు చేయడం జరిగిందన్నారు. తద్వారా పోలీ సు, న్యాయశాఖపై ప్రజలకు మరింత నమ్మకం కలుగుతుందని.. భవిష్యత్‌లో నిందితులు తప్పు చేయాలంటే భయపడే పరిస్థితి ఉంటుందన్నారు. ఇందుకు కృషిచేసిన పీపీలు విజయ్‌కుమార్‌, శ్రీని వాస్‌రెడ్డి, సుగుణాదేవి, కోర్టు లైజన్‌ ఆఫీసర్‌ జిక్కిబాబు, కానిస్టేబుళ్లు పరమేశ్‌, సాయిబాబా, శ్రీధర్‌ను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్ర మంలో ఏఎస్పీ శంకర్‌, సీఐ శ్రీను పాల్గొన్నారు.

● బీచుపల్లి ఆభయాంజనేయస్వామిని ఎస్పీ శ్రీని వాసరావు కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్ర త్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ సిబ్బంది ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం శేషవస్త్రంతో సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement