వైభవంగా సప్తాహ భజనలు | - | Sakshi
Sakshi News home page

వైభవంగా సప్తాహ భజనలు

Aug 11 2026 1:12 AM | Updated on Aug 11 2026 1:12 AM

మల్దకల్‌: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో సప్తాహ భజనలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం మండలంలోని బిజ్వారం, చర్లగార్లపాడు, ఆరగిద్ద, సంకాపురం, పారుచర్ల గ్రామాలకు చెందిన భజన మండలి సభ్యులు భజనలో పాల్గొన్నారు. వారం రోజులపాటు నిరంతరంగా కొనసాగే ఈ సప్తాహా భజనలు మండలి సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ ప్రహ్లాదరావు, చంద్రశేఖర్‌రావు, అర్చకులు మధుసూదనాచారి, రవిచారి, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement