మూడు ముళ్ల బంధం! | - | Sakshi
Sakshi News home page

మూడు ముళ్ల బంధం!

Aug 10 2026 1:04 AM | Updated on Aug 10 2026 1:04 AM

జిల్లాలో ఆగని బాల్యవివాహాలు

చదువుకన్నా పెళ్లికే ప్రాధాన్యమిస్తున్న తల్లిదండ్రులు

క్షేత్రస్థాయిలో అవగాహన

కల్పిస్తున్నా మారని తీరు

ఎనిమిదేళ్ల కాలంలో 370 బాల్యవివాహాల అడ్డగింత

అడ్డుకట్ట వేయాల్సిందే..

బాల్యవివాహాలు ఎక్కడ జరిగినా అడ్డుకోవాల్సిందే. బాల్యవివాహాలతో చిన్నారుల బతుకులు ఆగమవుతాయి. బాలల సంరక్షణ కమిటీల ద్వారా బాల్యవివాహాలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. కొన్ని చోట్ల బాల్యవివాహం చేస్తున్నట్లు సమాచారం వచ్చిన వెంటనే అక్కడికి వెళ్లి నిలిపివేస్తున్నాం. బాల్యవివాహాలకు అడ్డుకట్ట వేసేందుకు గ్రామాల్లో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. – సునంద,

జిల్లా సంక్షేమశాఖ అధికారిణి

కఠినంగా

వ్యవహరిస్తాం..

బాల్యవివాహాలపై కఠినంగా వ్యవహరిస్తాం. అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని జిల్లాలో బాల్యవివాహాల నిరోధానికి చర్యలు తీసుకుంటున్నాం. బాల్యవివాహాలు జరిపించినా, ప్రోత్సహించినా చట్టపరంగా శిక్షార్హులు అవుతారు. ఈ మేరకు కళా బృందాలు, భరోసా కేంద్రం ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. లైంగిక దాడులకు గురైన బాలికలకు రక్షణ కల్పించడంతో పాటు సాధారణ స్థితికి చేరుకునే విధంగా చేయడంతో పాటు న్యాయ సహాయం అందిస్తున్నాం.

– శ్రీనివాసరావు, ఎస్పీ

గట్టు: పోటీ ప్రపంచంలో ఉన్నత లక్ష్యాలు సాధించి కన్నవారికి, పుట్టి పెరిగిన ఊరికి మంచి పేరు తీసుకొద్దామనుకుంటున్న బాలికల కలలను కొందరు మూడు ముళ్లతో ముడి పెట్టేస్తున్నారు. తోటి స్నేహితులతో ఆడుతూ.. పాడుతూ గడపాల్సిన బాల్యాన్ని చెరిపేస్తున్నారు. చదువుకోవాలనే తపన ఉన్నా అమ్మాయికి పెద్ద చదువులెందుకంటూ.. పెళ్లి పేరుతో మరొకరి చేతులో పెట్టేందుకు తల్లిదండ్రులు వెనుకాడటం లేదు. జిల్లావ్యాప్తంగా బాలల సంరక్షణ అధికారులు గ్రామస్థాయిలో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ.. బాల్య వివాహాలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడటం లేదు. అధికారులు దృష్టికి వచ్చిన కొన్ని బాల్య వివాహాలను మాత్రమే అడ్డుకుంటున్నారు. మరికొన్నింటిని గుట్టుచప్పుడు కాకుండా మూడుముళ్ల వేయించేస్తున్నారు. గ్రామస్థాయిలో బాల్య వివాహాలు నిర్వహించరాదని ఎంతగా చెబుతున్నప్పటికీ తల్లిదండ్రుల ఆలోచనా విధానంలో మార్పు రావడం లేదు.

ఎనిమిదేళ్ల కాలంలో బాల్యవివాహాల అడ్డగింత ఇలా..

2022 65

2021 70

2019

55

2020 95

2026 జూన్‌ వరకు : 20

2025

70

2023

40

2024

55

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement