● టాస్క్ ‘ఎఫ్‌ఎఫ్‌ఎస్’ యాప్‌ప్రవేశపెట్టనున్న కేంద్రం
● జిల్లాలో నత్తనడకన
సాగుతున్న ఫార్మర్ రిజిస్ట్రీ
● ఇప్పటివరకు 73 శాతమే..
● కౌలు రైతులకు అందని ద్రాక్షలా ఎరువులు
అయిజ: ఎరువుల కోసం రైతులు గంటల తరబడి డీలర్ల దుకాణాల వద్ద క్యూలో నిలబడాల్సిన పరిస్థితిని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫర్టిలైజర్ బుకింగ్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ నెల 13 నుంచి ఎఫ్‌ఎఫ్‌ఎస్ (ఫ్రేమ్ ఫర్ ఫర్టిలైజర్స్ సేల్) యాప్ ద్వారా యూరియాతో పాటు కాంప్లెక్స్ ఎరువులను కూడా రైతులకు అందించనున్నారు. అయితే ఇప్పటి వరకు ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకున్న రైతులకు మాత్రమే యూరియా ఇస్తున్నారు. జిల్లాలో మొత్తం 1,85,499 మంది రైతులు ఉండగా.. ఇప్పటి వరకు 1,36,283 మంది రైతులు మాత్రమే ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకున్నారు. ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోని 27 శాతం రైతులకు నూతనంగా ప్రవేశపెట్టనున్న ఎఫ్‌ఎఫ్‌ఎస్ ద్వారా ఎరువులు అందని ద్రాక్షలా మిగిలిపోనున్నాయి.
అడ్డంకిగా సాంకేతిక కారణాలు..
రైతులకు సంబంధించిన ఆర్‌ఓఆర్‌లో భూమి వివరాలు సరిగా లేకపోవడంతో ఫార్మర్ ఐడీ రావట్లేదు. ఆధార్‌లో ఉన్న పేరు, పట్టా పాస్‌బుక్‌లో ఉన్న పేరు కొద్దిగా తేడా ఉంటే సిస్టమ్ రిజెక్ట్ చేస్తుంది. చనిపోయిన వ్యక్తుల పేరున ఉన్న భూమి వారుసులకు మ్యుటేషన్ కాకపోవడం, పాత రికార్డులు డిజిటల్ కాకపోవడం లేదా తప్పుగా డిజిటల్ కావడం వలన ఫార్మర్ రిజిస్ట్రీ కావడంలేదు. అదేవిధంగా జాయింట్ ఓనర్‌షిప్‌లో అందరి పేర్లు సరిగా లింక్ కాకపోవడం, భూమి వివాదాలు, కోర్టు కేసులు, రికార్డులు లాక్ అయి ఉండటం, రెవెన్యూ, వ్యవసాయ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల కూడా ఫార్మర్ రిజిస్ట్రీలో జాప్యం జరుగుతోంది.
మండలం రైతుల ఫార్మర్ రిజిస్ట్రీ
సంఖ్య శాతం
అలంపూర్ 10,644 78.21
ధరూర్ 14,831 73.16
గద్వాల 19,599 73.58
గట్టు 19,038 69.47
అయిజ 24,181 68.81
ఇటిక్యాల 10,098 75.89
కేటీ దొడ్డి 12,504 67.83
మల్దకల్ 19,403 74.36
మానవపాడు 11,213 79.53
రాజోళి 11,034 72.10
ఉండవెల్లి 11,567 71.13
వడ్డెపల్లి 11,027 80.32
ఎర్రవల్లి 10,360 79.54
మండలాల వారీగా..


