ధరూరు: మండలంలోని పెద్దచింతరేవుల ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం ఆషాఢ కృష్ణ దశమిని పురస్కరించుకొని అర్చకులు కేశవచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉత్తరాధి పాలమరి మఠాల పీఠాధిపతులు 1008 విద్యాదేశ తీర్థ శ్రీపాదులు, 1008 విద్యారాజేశ్వర తీర్థ శ్రీపాదులు హాజరై స్వామివారికి సుగంద ద్రవ్యాలతో అభిషేకం, అష్టోత్త, మంగళహారతి పూజలు జరిపారు. స్వామివారిని కొలువడం వల్ల శాంతి, ఐశ్వర్యం, ధైర్యసాహసాలు లభిస్తాయని పేర్కొన్నారు. 18వ శతాబ్దంలో వ్యాస శేషదాసుల వారు ఈ ప్రతిష్టాపన చేసినట్లు ప్రధాన అర్చకులు కేశవాచార్యులు వివరించారు. శనివారం నుంచి 55 రోజులపాటు భక్తులకు అల్పాహారం, అన్నప్రసాద వితరణ చేపడుతామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో అర్చకులు వామనాచారి, కిష్టాచారి, మద్వాచారి తదితరులు పాల్గొన్నారు.


