ఎర్రవల్లి: విద్యార్థులకు మెరుగైన విద్య అందించడంతో పాటు అన్ని వసతులు కల్పించాలని అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు అన్నారు. బుధవారం ఎర్రవల్లి కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు అందిస్తున్న విద్యాభోదన, వసతి, భోజన సౌకర్య, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, తరగతి గదులు, డార్మెటరీలు, వంటశాల, భోజనశాల తదితర ఏర్పాట్లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థినులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థులకు పరిశుభ్రమైన, సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించడం ప్రతి అధికారి బాధ్యత అని అన్నారు. విద్యార్థినుల ఆరోగ్యం, పోషకాహారం, పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు. ఆయన వెంట ఎస్‌ఓ స్వర్ణలత ఉన్నారు.


