గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు మంగళవారం 326 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. కాగా.. క్వింటాల్ గరిష్టంగా రూ.8,100, కనిష్టంగా రూ.3,616, సరాసరిగా రూ.5,680 ధరలు లభించాయి.
ఆరోగ్య కార్యక్రమాలపై నిర్లక్ష్యమొద్దు
గద్వాల క్రైం: జిల్లాలో ఆరోగ్య కార్యక్రమాలు చేపట్టడంపై సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ సంధ్యాకిరణ్మయి అన్నారు. మంగళవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులపై సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. అలాగే అన్ని పీహెచ్‌సీల్లో సరిపడా మందులు ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.


