వాలీబాల్ ఆడుతున్న క్రీడాకారులు
గద్వాల: క్రీడలు మానసిక, శారరీక వికాసానికి ఎంతో దోహదపడుతాయని అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు అన్నారు. జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాల మైదానంలో బుధవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 172 ప్రభుత్వ, ప్రైవేటు సీబీఎస్ పాఠశాలలకు చెందిన క్లస్టర్–7 బాలుర వాలీబాల్ చాంపియన్‌షిప్ నిర్వహించారు. పోటీల ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. విజయం కంటే క్రీడాస్ఫూర్తితో ఆడటం ముఖ్యమన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 172 పాఠశాలలకు చెందిన 3వేల మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ రాము పాల్గొన్నారు.


