గతేడాది ఈ సమయానికి నది పరివాహక గ్రామాల్లో జోరుగా వరి నాట్లు వేశాం. ఏరువాక పండుగకే నదిలో నీరు రావడంతో గ్రామాలు వరి పైర్లతో పచ్చదనం సంతరించుకుని ఉండేవి. ఇప్పడేమో ఎక్కడ చూసినా ఖాళీ భూములు మాత్రమే కనిపిస్తున్నాయి. పరిస్థితి మున్ముందు ఇంకెలా మారుతుందో అర్థం కావడం లేదు. గత వారమే నదికి నీరు వస్తుందనుకున్నాం. రాకపోవడంతో ఆందోళన తప్పడం లేదు. – తిమ్మారెడ్డి, రైతు,
పెద్దధన్వాడ, రాజోళి మండలం
కనీస స్థాయిలో కూడా లేవు..
ఈ సమయానికే నది నీటితో గ్రామాల్లో వరి నాట్లు వేసేవాళ్లం. ఇంత వరకు నదికి వరద నీరు రాలేదు. దీంతో కనీస స్థాయిలో కూడా నాట్లు వేయలేదు. ఒకరిద్దరు రైతులు తమకున్న నీటి వనరుల ఆధారంగా నాట్లు వేశారు. మిగతా రైతులు ధైర్యం చేసి వేయాలంటే.. నీరు వస్తుందో రాదో తెలియడం లేదు. మరో వారంలోగా నీరు రాకపోతే గడ్డు పరిస్థితులు తప్పవు.
– అయ్యప్ప, రైతు,
బుడమర్సు, వడ్డేపల్లి మండలం
●


