గద్వాలన్యూటౌన్: విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు అవసరమని.. ప్రతి విద్యార్థి క్రీడల్లో పాల్గొనే లా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని డీవైఎస్‌ఓ రా మలింగేశ్వర్‌గౌడ్ సూచించారు. ఆదివారం స్థానిక బృందావన్ గార్డెన్‌లో గద్వాల లయన్స్ క్లబ్ అధ్య క్షుడు కృష్ణయ్య, రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ అ య్యపురెడ్డి, స్టేడియం ఇన్‌చార్జి బషీర్‌తో కలిసి జిల్లా తైక్వాండో చాంపియన్‌షిప్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. తైక్వాండో వంటి యుద్ధ కళలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసంతో పాటు క్రమశిక్షణ, శారీరక దృఢత్వం, విధేయత వంటి సద్గుణాలను పెంపొందిస్తాయని చెప్పారు. క్రీడల్లో గెలుపోటములు సహ జమని.. ప్రతి క్రీడాకారుడు క్రీడాస్ఫూర్తిని అల వర్చుకోవాలని సూచించారు. కాగా, సబ్ జూనియ ర్, క్యాడెడ్, జూనియర్, సీనియర్ విభాగాల్లో బాలబాలికలకు కొరియో, పూమ్సే పోటీలు నిర్వహించగా..400 మంది క్రీడాకారులు పాల్గొని ప్రతిభ చా టారు. ప్రథమ స్థానంలో నిలిచిన క్రీడాకారులు ఆ గస్టు 8, 9, 10 తేదీల్లో కరీంనగర్‌లో జరిగే రాష్ట్రస్థా యి తైక్వాండో పోటీల్లో జిల్లా తరఫున పాల్గొంటా రని జిల్లా తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి మాస్టర్ శ్రీహరి తెలిపారు. కార్యక్రమంలో కోచ్‌లు శ్రీనివాసశెట్టి, రంగస్వామి, మారుతి శ్రీను, రామేశ్వరి,మల్లిఖార్జున్‌గౌడ్, లింగేష్, విష్ణు, సుదీర్ తదితరులు పాల్గొన్నారు.


