సర్‌ ప్రక్రియ వందశాతం పూర్తిచేయాలి | - | Sakshi
Sakshi News home page

సర్‌ ప్రక్రియ వందశాతం పూర్తిచేయాలి

Jul 26 2026 2:14 AM | Updated on Jul 26 2026 2:14 AM

గద్వాల: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్‌ఐఆర్‌ ప్రాధాన్యతపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ అన్నారు. శనివారం కలెక్టరేట్‌ వీసీ హాల్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇప్పటివరకు 84శాతం డిజిటలైజేషన్‌ పూర్తయిందని.. ఆగస్టు 3వ తేదీలోగా వందశాతం ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించారు. అనంతరం భూ భారతి, సాదాబైనామా దరఖాస్తులపై చర్చించారు. ఆయా దరఖాస్తులను సకాలంలో పరిష్కరించి.. రీ సర్వే పనులను వేగవంతం చేయాలని తహసీల్దార్లకు స్పష్టం చేశారు. అదే విధంగా కుల, ఆదాయ, నివాస ధ్రువపత్రాల జారీలో ఆలస్యం చేయొద్దని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ మధుమోహన్‌, ఆర్డీఓ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement